‘కథాశివిర్’కు ఓరుగల్లు విద్యార్థులు
జనగామ: దేశ యువతలో జాతీయత, క్రమశిక్షణ, సాంస్కృతిక చైతన్యం, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు రూపొందించిన రాష్ట్రీయ కథాశివిర్ ఉమ్మడి జిల్లా విద్యార్థులకు అపూర్వ అవకాశంగా మారింది. గుజరాత్ రాష్ట్రంలోని ఉప్లేటా, ప్రాస్‌లా గ్రామంలో నిర్వహిస్తున్న 26వ ‘రాష్ట్రీయ కథా శివిర్’కు ఉమ్మడి జిల్లా నుంచి 20 మంది విద్యార్థుల (10 మంది బాలురు, 10 మంది బాలికలు)ను ఎంపిక చేశారు. జనగామ జిల్లాలోని కొడకండ్ల సోషల్ వెల్ఫేర్, పాలకుర్తి పీఎం శ్రీ ఉన్నత పాఠశాల నుంచి ఇద్దరి చొప్పున నలుగురు విద్యార్థులు ఎంపిక కాగా, వరంగల్, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి నుంచి 26 మంది కథా శివిర్‌కు అర్హత సాధించారు. 27వ తేదీ (శనివారం)నుంచి జనవరి 4 వరకు ‘శివిర్’ కార్యక్రమం జరగనుంది. ఎంపికై న విద్యార్థులతో ప్రతీ జిల్లానుంచి ఇ ద్దరు (పురుష, మహిళ) ఉపాధ్యాయులు వెళ్లారు. ప్రతిభ, ఆసక్తి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంవంటి అంశాలు ప్రమాణాలుగా విద్యార్థులను ఎంపిక చే శారు. శివిర్‌ను నిర్వహిస్తున్న శ్రీ వేదిక్ మిషన్ ట్ర స్ట్ దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెర్రి టరీలనుంచి విద్యార్థులను ఆహ్వానించింది. మొత్తం 2.76లక్షల మంది విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు పాల్గొటున్నారు. 800 నుంచి వేయి మంది విద్యార్థులకు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
అబ్దుల్ కలాం ప్రశంసలు..
● దివంగత, డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం వంటి ప్రముఖులు కూడా గతంలో ఈ శిబిరాలకు హాజరై ప్రశంసించినట్లు ట్రస్ట్ గుర్తు చేసింది.
● ప్రతి రోజు శిబిరంలో ఉదయం శారీరక శిక్షణతో ప్రారంభమై, ఉపన్యాసాలు, జాతీయ భద్రతా అంశాలు, నీతి, నిజాయితీ బోధనలు, క్రీడలు, కళా, సాంస్కృతిక, కార్యక్రమాలు, సైన్య విభాగాల ప్రదర్శనలు, భారత రాజ్యాంగం, జాతీయ సమైక్యత, సాంస్కృతిక, వ్యక్తిగత అభివృద్ధి, జాతీయవాదం, దేశ భక్తి, పర్యావరణంపై అవగాహన కల్పిస్తారు.
● డిజిటల్ ఇండియా, నీటి సంరక్షణ, మానవ హక్కులు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, ఆధ్యాత్మిక, సామాజిక సామరస్యం, విపత్తు నిర్వహణ, రహదారి భద్రత నియమాలు, మార్షల్ ఆర్ట్స్, జూడో, కరాటే, బాస్కెట్‌బాల్, వాలీబాల్, టాగ్‌ఆఫ్ వార్, యోగా, ధాన్యం తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు.
● వీటితోపాటు భారత సైన్యం, వైమానిక దళం, నావికాదళం, రక్షక దళం, ఎన్నికల కమిషన్, వివిధ ప్రదర్శనల గురించి విద్యార్థులకు తెలియజేస్తారు.
● ప్రముఖుల ఉపన్యాసం, చర్చావేదిక, మానవ, ప్రాథమిక విధులు, మహిళా సాధికారత, ప్రకృతి మధ్య సంబంధం, క్రీడలు, ఆటలు తదితర అంశాల గురించి రోజువారీగా వివరిస్తారు.
● శివిర్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లతోపాటు అందుకు సంబంధించి పుస్తకాలు అందజేస్తారు.
ఉమ్మడి జిల్లా నుంచి 20 మంది ఎంపిక
గుజరాత్‌లో నేటినుంచి దేశవ్యాప్త
శిక్షణ ప్రారంభం
వ్యక్తిత్వ వికాసం..
జాతీయతపై తరగతులు
జిల్లాల వారీగా
విద్యార్థుల సంఖ్య
జిల్లా విద్యార్థులు
జనగామ 04
వరంగల్ 04
హనుమకొండ 04
ములుగు 04
భూపాలపల్లి 04
మొత్తం 20


