విద్యుదాఘాతంతో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
బయ్యారం: విద్యుదాఘాతంతో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన ఘటన మానుకోట జిల్లా బయ్యా రం మండలంలోని కాచనపల్లి స మీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోటగడ్డ గ్రామానికి చెందిన ఊకే వెంకటేశ్వర్లు(42) పదిహేనేళ్లుగా విద్యుత్‌శాఖలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వి ద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫీజు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ప్రసారం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్వర్లు భార్య రమ్యకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై మహబూబీ కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఏడీఏ రమేష్, ఏఈ సుమన్, సబ్‌ఇంజనీర్ సందీప్ తోపాటు సిబ్బంది పరిశీలించి నివాళులర్పించారు.


