సందిగ్ధంలో విద్యుత్ ఉద్యోగుల బదిలీలు
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగుల బదిలీలపై సందిగ్ధత నెలకొంది. విద్యుత్ ఉద్యోగుల బదిలీలు జరుగుతాయని గత 15 రోజులుగా విస్తృత ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో ఉద్యోగుల సీనియారిటీ జాబితాతో బదిలీలు జరుగుతాయనే స్పష్టత వచ్చింది. మరో వైపు ఇంధన శాఖ బదిలీలపై నిషేఽ దం ఎత్తివేయడంతో విద్యుత్ ఉద్యోగుల బదిలీలు ఇక ఆగవనే నమ్మకాన్ని విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో కల్పించింది. బదిలీలు కోరుకునే వారు ఆశల్లో తేలియాడుతుండగా మరో వైపు విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయడమేమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బదిలీలపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత యాజమాన్యానికి చేరడంతో బదిలీలపై విద్యుత్ ఉద్యోగుల సంఘాలు, ఇంజనీర్స్, పీ అండ్ జీ, అకౌంట్స్ ఆఫీసర్స్ అసోషియేషన్‌లతో టీజీ ఎ న్పీడీసీఎల్ యాజమాన్యం ఈ నెల 27న ప్రత్యేక స మావేశం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం జ రిగే సమావేశంలో బదిలీలు చేపట్టాలా.. వద్దా.. చేపడితే మార్గదర్శకాలు ఎలా ఉండాలి.. అనే అంశాల పై యాజమాన్యం చర్చించనుంది. సంఘాలు, అ సోసియేషన్ల నుంచి వచ్చే అభిప్రాయాల మేరకు బ దిలీలపై తుది నిర్ణయం వెలువడే అవకాశముంది.
బదిలీలపై భిన్నాభిప్రాయాలు..
సాధారణంగా మే, జూన్ మాసంలో బదిలీలు జరుగుతాయి. కానీ, ఇందుకు విరుద్దంగా మధ్యలో బదిలీలు చేయడమేమిటని కొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ సమయం బదిలీలకు సరైంది కాదని వ్యక్తం చేస్తున్నాయి. మరో నాలుగు నెలలు ఆగాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో వైపు స్థానచలనం కోరుకుంటున్న వారు బదిలీలు ఎప్పు డు జరిగితే ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో బదిలీ లపై విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజార్టీ సంఘాలు, అసోసి యేషన్ల అభిప్రాయాల మేరకు యాజమాన్యం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
ఇన్‌చార్జ్ పదోన్నతిపై ఆశలు..
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఇతర వర్క్‌మెన్ క్యాడర్ ఉద్యోగులు పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇంజనీర్లు, పీ అండ్ జీ, అకౌంట్స్ విభాగంలో ఇంచార్జ్ పదోన్నతి ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో వర్క్‌మెన్ క్యాడర్‌లో తమకు కూడా ఇంచార్జ్ పదోన్నతి కల్పించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ మేరకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజ మాన్యం వర్క్‌మెన్ క్యాడర్‌లో ఇంచార్జ్ పదోన్నతి కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో సీనియారిటీ జాబితాను సిద్ధం చేసింది. ఇంచార్జ్ పదోన్నతితోపాటు బదిలీలు చేయాలనే ఆ లోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలిసింది. బదిలీ లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న క్రమంలో ఇంచార్జ్ పదోన్నతుల అంశం ఎటు తిరుగుతుందో ననే ఆందోళనలో విద్యుత్ ఉద్యోగులున్నారు. బది లీలకు సంబంధం లేకుండా ఇంచార్జ్ పదోన్నతి కల్పించాలని పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు కోరుతుండడం గమనార్హం.
ఉద్యోగ సంఘాలతో చర్చించనున్న యాజమాన్యం
నేడు ఉద్యోగ సంఘాలతో సమావేశం
ఇప్పటికే సీనియారిటీ జాబితాల తయారీ


