హోరాహోరీగా రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలు

Dec 27 2025 7:57 AM | Updated on Dec 27 2025 7:57 AM

హోరాహ

హోరాహోరీగా రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలు

రెండో రోజు ఉత్సాహంగా పాల్గొన్న

క్రీడాకారులు

కేసముద్రం: మానుకోట జిల్లా కేసముద్రం మున్సిపల్‌ పరిధిలోని వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలు రెండోరోజు శుక్రవారం హోరాహోరీగా సాగాయి. ట్రెడిషనల్‌ విభాగంలో జరిగిన ఫైనల్స్‌లో మహబూబాబాద్‌ జట్టు(పురుషుల విభాగం) 22 పాయింట్లతో మొదటి విజేతగా గెలుపొందినట్లు నిర్వాహకులు తెలిపారు. నారాయణపేట 20 పాయింట్లతో రెండో విజేతగా నిలవగా, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జట్లు 6 పాయింట్లు సంయుక్తంగా సాధించి తృతీయస్థానంలో నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. సీ్త్రల విభాగంలో జరిగిన ట్రెడిషనల్‌ మ్యాచ్‌లో మేడ్చల్‌ 19 పాయింట్లతో మొదటిస్థానంలో నిలవగా, మహబూబ్‌నగర్‌ జట్టు ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. రంగారెడ్డి, నల్లగొండ, ఇరుజట్లు సంయుక్తంగా 4 పాయింట్లతో తృతీయ స్థానంలో నిలిచాయి. ముందుగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ గంట సంజీవరెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో నెట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు వేం వాసుదేవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మ సురేష్‌, పీడీ కొప్పుల శంకర్‌, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్‌రావు, ఆర్టీఏ మెంబర్‌ రావుల మురళీ, బండారు దయాకర్‌, చిదురాల వసంతరావు, వేం యాకుబ్‌రెడ్డి, లెంకల సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బ్లాక్‌ బెర్రీ ఐ ల్యాండ్‌ పునఃప్రారంభం

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: ములుగు జిల్లా పస్రా – తాడ్వా యి మధ్యలో జలగవంచ వాగులో అటవీశాఖ ఏర్పాటు చేసిన పర్యాటక ప్రాంతం బ్లాక్‌ బెర్రీ ఐల్యాండ్‌ను శుక్రవారం రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ములుగు జిల్లా అంటేనే పర్యాటకులకు నిలయం అని, జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో బ్లాక్‌ బెర్రీ ఐ ల్యాండ్‌ ఒకటని పేర్కొన్నారు. పర్యాటకులు ఇక్కడ ఆనందంగా గడపవచ్చని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ దివాకర టీఎస్‌, ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేగ కళ్యాణి పాల్గొన్నారు.

హోరాహోరీగా రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలు
1
1/2

హోరాహోరీగా రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలు

హోరాహోరీగా రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలు
2
2/2

హోరాహోరీగా రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement