నేటినుంచి గోల్డెన్‌జూబ్లీ ముగింపు సమావేశాలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనిర్సిటీ ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాలు ఈనెల 27, 28 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్నా యి. ముగింపు స మావేశాలను హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశా రు. ఫార్మసీ కళాశాల పూర్వవిద్యార్థి ప్రవాస భారతీయుడు, అమెరికా సంయుక్తరాష్ట్రా ల నివాసి డాక్టర్ సాంబారెడ్డి కన్వీనర్‌గా, కోకన్వీనర్‌గా కే యూ ఫార్మసీ కళా శాల డీన్ ఆచార్య గాదె సమ్మయ్య, అధ్యక్షురాలిగా ఫార్మసీ కళాశాల ప్రిన్సి పాల్ ఆచార్య కృష్ణవేణి వ్యవహరిస్తుండగా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య ప్రసాద్, వైస్ చైర్మన్ ఆచార్య నర్సింహారెడ్డి బాధ్యులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ షాయెదా, డాక్టర్ స్వరూపరాణి తదితరులు ఏర్పా ట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఫార్మసీ కళాశా ల పూర్వవిద్యార్థులు హాజరుకా నున్నారు. ఈనెల 27న జరిగే ఈ గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల ముగింపు ప్రారంభ సమావేశంలో ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌లోని అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ మధన్‌మోహన్‌రెడ్డి గౌరవఅతిథిగా అమెరికా లోని టెక్సాస్ ఎఅండ్‌ఎం యూనివర్సిటీ కాలేజీ ఫా ర్మసీ డీన్ డాక్టర్ మన్సూర్‌ఖాన్, చీఫ్ ప్యాట్రన్‌గా కే యూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి, ప్యాట్రన్‌గా కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం పాల్గొని ప్రసంగించనున్నారని నిర్వాహకులు తెలిపారు.
పార్మసీ కాలేజీలో రెండు రోజులపాటు
నిర్వహణ


