నేటినుంచి రాష్ట్రస్థాయి జూడో పోటీలు
రామన్నపేట: ఉమ్మడి వరంగల్ జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీల్లో నగరంలోని పోచమ్మ మైదాన్‌లోని కెమిస్ట్రీ భవన్‌లో రాష్ట్రస్థాయి జూనియర్ జూడో పోటీలు నిర్వహించినున్నట్లు తెలంగాణ రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడు బైరబోయిన కై లాష్ యాదవ్ తెలిపారు. శుక్రవారం నగరంలోని కెమిస్ట్రీ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొనే బాల బాలికలు 2006 నుంచి 2011 సంవత్సరం మధ్య జన్మించి ఉండాలని, బాలుర విభాగంలో అండర్ 55 కేజీల విభాగం నుంచి 100 కేజీ అదనం విభాగాల వరకు, బాలికలకు అండర్ 44 కేజీల విభాగం నుంచి 78 కేజీల అదనం విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకొని రావాలని సూచించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు భోజనం, వసతి, పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌తోపాటు గెలుపొందిన వారికి సర్టిఫికెట్‌తోపాటు మెడల్స్ అందించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు జనవరి 23 నుంచి 26వ తేదీల్లో కలకత్తాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, వరంగల్ క్రీడా మండలి అధికారి అనిల్, హ్యాండ్‌బాల్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్, తెలంగాణ జూడో అసోసియేషన్ బాధ్యులు సోమరాజు, దుపాకి సంతోష్ కుమార్, కోచ్‌లు లింగమూర్తి, చుక్కా రామకృష్ణ, రాము, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
కై లాష్ యాదవ్


