సభను విజయవంతం చేయాలి
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో ఈనెల 27న బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సర్పంచ్‌ల ఆత్మీయ అభినందన సన్మాన సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత నివాస గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 18 మండలాలకు చెందిన పార్టీ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సర్పంచ్‌ల ఆత్మీయ అభినందన సన్మాన సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారన్నారు. మళ్లీ ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు తీసి ఇబ్బందులు పెట్టే కుట్ర చేస్తున్నారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలు, ప్రస్తుత పరిస్థితులు, ఇతర విషయాలపై కేటీఆర్ మాట్లాడుతారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటుదామన్నారు. మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, మున్సిపల్ మాజీ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ వెంకన్న, నాయకులు నవీన్‌రావు, మహేందర్‌రెడ్డి, ముత్యం వెంకన్న, మురళీధర్‌రెడ్డి, శ్రీను, అశోక్, రఘు ఉన్నారు.


