క్రీస్తు బోధనలు అనుసరణీయం: సీతక్క
కొత్తగూడ: మండలంలోని సరసనపల్లిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యేసుక్రీస్తు బోధనలు అనుస రణీయమని అన్నారు. ఎవరి ఆచారాలు, విశ్వాసాలు వారు పాటిస్తూ ఎదుటి వారి నమ్మకాలను గౌరవించాలన్నారు. ముందుగా నూతనంగా నిర్మించిన చర్చిని ప్రారంభించారు.
రోడ్డు పనుల పరిశీలన..
మండల కేంద్రం సమీపంలోని గాదెవాగు పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంజ సూర్య, కుసుమాంజలి, వజ్జ సారయ్య, చల్ల నారాయణరెడ్డి, మల్లెల రణధీర్, బిట్ల శ్రీనివాస్, బానోతు రూప్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.


