లెక్క.. పక్కాగా చూపాల్సిందే
సంగెం : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కచ్చితంగా ఖర్చుల వివరాలు అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో భవిష్యత్‌లో ఎన్నికల బరిలో నిలబడే అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. నిబంధనల మేరకు గెలిచిన అభ్యర్థులే లెక్కలు ఇస్తారు.. తాము సమర్పించకుంటే ఏమవుతుందిలే అని ఓడిపోయిన అభ్యర్థులు అనుకుంటే చిక్కుల్లో పడినట్లే. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన వారందరూ విధిగా లెక్కలు సమర్పించాలని, లేనిపక్షంలో వేటు పడే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. కాగా, నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఐదు వేల జనాభా దాటిన జీపీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ 2.50 లక్షలు, వార్డు సభ్యులు రూ. 50 వేలు, 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ1.50 లక్షలు, వార్డు సభ్యులు రూ. 30 వేల వరకు ఖర్చు చేసుకోవచ్చు.
● అభ్యర్థులు.. ఎన్నికల ఖర్చుకు సంబంధించి ప్రచార, వ్యయ పుస్తకాలను ఎప్పటికపుడు నమోదు చేసుకుని ఎన్నికల వ్యయ పరిశీలకులకు సమర్పించాలి.
● అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసినప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు జరిగిన ఖర్చుల వివరాలను పుస్తకాల్లో ఏ రోజుకు ఆ రోజు నమోదు చేసుకుని ఎన్నికల వ్యయ పరిశీలకులకు సమర్పించాలి.
● ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోటీలో నిలిచిన అభ్యర్థులు గెలిచినా, ఓడినా నిర్ణీత గడువులోగా లెక్కలు చూపాలి.
మూడు దశల్లో లెక్కల ఖర్చు చూపాలి..
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతోపాటు ఓడిపోయిన వారు కూడా తమ ఖర్చుల లెక్కలు మూడు దశల్లో చూపాలి. ఇప్పటి వరకు జిల్లాలో తొలివిడత ఈ నెల 11న, రెండో విడత 14న, మూడో విడత 17వ తేదీన జరిగాయి. అయితే ఇప్పటి వరకు ఒక దశ కూడా ఎన్నికల ఖర్చులు చూపని అభ్యర్థులు ఉన్నారు. కాగా, ఎన్నికల ఖర్చులను లెక్కించడానికి ఆడిట్ శాఖ అధికారులను మండలాల వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించింది. మండలాల వ్యయపరిశీలనపై ఆడిట్‌శాఖ ఉన్నతాధికారులను జిల్లాకు ఒకరిని నియమించారు.
నోటీసులు జారీ చేసే అవకాశం..
అభ్యర్థులు ఎన్నికల లెక్కలు చూపడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో నోటీసులు జారీ చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం సీరియస్‌గా ఉంది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన నాటి నుంచి 45 రోజుల్లో పూర్తి లెక్కలు చూపని అభ్యర్థులు రానున్న ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది.
లేదంటే చిక్కులు తప్పవు..
ఎన్నికల ఖర్చులు అభ్యర్థులు
సమర్పించాల్సిందే..
గడువులోగా చూపకపోతే నోటీసులు జారీ
భవిష్యత్‌లో పోటీకి అనర్హులయ్యే
అవకాశం
లెక్కకు మించితే వేటు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతల్లో గెలుచుకున్న
పార్టీల మద్దతుదారులు (ఏకగ్రీవాలు కలుపుకుని)
విడత గ్రామాలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ ఇతరులుమొదటి 555 333 148 17 57
రెండు 563 332 181 09 41
మూడో 564 371 150 05 38


