తల్లి మందలించిందని విద్యార్థి ఆత్మహత్య
ములుగు రూరల్: సరిగా చదవడం లేదని త ల్లి మందలించగా మనస్తాపం చెందిన ఓ వి ద్యార్థి గడ్డి మందుతాగి ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని జాకారంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్‌రావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓరుగంటి విశ్వత్(16) పదో తరగతి చదువుతున్నాడు. అయితే సరిగా చదవడం లేదని తల్లి బుధవారం మందలించింది. దీంతో మనస్తాపం చెందిన విశ్వత్ గడ్డిమందుతాగాడు. స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించగా వారు వరంగల్ ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈఘటనపై మృతుడి తల్లి భీష్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


