క్రిస్మస్..శాంతి, సామరస్యానికి ప్రతీక
నర్సంపేట రూరల్: క్రిస్మస్.. శాంతి, సామరస్యానికి ప్రతీకని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌లో తన మిత్రులు పూదోట సురేశ్‌కుమార్, సుధీర్‌కుమార్ ఇంటి వద్ద నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి బుధవారం రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో క్రీస్తు బోధనలు మానవాళికి ఆచరణీయమన్నారు. అంతేకాక ఏసుక్రీస్తు అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఆ కరుణామయుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేశ్, జిల్లా కార్యదర్శి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మొగిలి వెంకట్‌రెడ్డి, నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్యగౌడ్, యూత్ మండల అధ్యక్షులు బండి హరీశ్, మాదారపు చరణ్, నరిశెట్టి సతీశ్, పూదోట నవీన్‌కుమార్, సునీల్‌కుమార్, బోటర్, తదితరులు పాల్గొన్నారు.
ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు


