క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
కేసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే భూ క్య మురళీనాయక్ అన్నా రు. గురువారం మున్సి పల్ కేంద్రంలో జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సీనియర్, పాస్ట్ ఫైవ్ నెట్‌బాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే యువతకు భవిష్యత్ ఉంటుందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. కాగా, రాష్ట్ర స్థాయి క్రీడల్లో 27 జిల్లాల నుంచి మహి ళ, పురుషుల విభాగంలో 800 మంది క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజు ట్రెడిషనల్, పాస్ట్‌పైవ్, మిక్స్‌డ్ విభాగంలో లీగ్ మ్యాచ్‌లు పూర్తయినట్లు తెలిపారు. నెట్‌బాల్ అ సోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్ ఆది త్యారెడ్డి, ప్రధాన కార్యదర్శి శిరీషారాణి, జిల్లా అధ్యక్షుడు వేం వాసుదేవరెడ్డి, ప్రధా న కార్యదర్శి తుమ్మ సురేశ్, ఆర్‌టీఏ డైరెక్టర్ రావుల మురళి, పీడీ కొప్పుల శంకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్‌రావు, నాయకులు అంబటి మహేందర్‌రెడ్డి, గుగులోత్ దస్రూ నా యక్, బండారు వెంకన్న, కదిర సురేందర్, ఎం.డి. ఆయూబ్‌ఖాన్, సీహెచ్. ఎలేందర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
కేసముద్రంలో రాష్ట్రస్థాయి నెట్‌బాల్
పోటీలు ప్రారంభం


