ఐటీ కోర్ బృందానికి ప్రశంసపత్రాల అందజేత
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో విధుల్లో రాణించిన ఐటీ కోర్ బృందాన్ని అభినందిస్తూ అదనపు డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి.శ్రీనివాసరావు ప్రశంస పత్రాలు అందజేశారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీఎన్‌ఎస్ విధుల్లో రాణించిన ఐటీ కోర్ సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా కమిషనరేట్ ఐటీ కోర్ హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, కానిస్టేబుళ్లు శ్రవణ్ కుమార్, నర్సయ్య, రమేశ్‌తోపాటు హసన్‌పర్తి, దుగ్గొండి, స్టేషన్‌ఘన్‌పూర్ కానిస్టేబుళ్లు సోమన్న, రాకేశ్, రాఘవేందర్‌ను అదనపు డీజీపీ అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు. కాగా, ప్రశంస పత్రాలు అందుకున్న ఐటీ కోర్ సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి అధికారుల గుర్తింపుతో పాటు శాఖపరమైన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.


