పర్యాటక బ్రోచర్ ఆవిష్కరణ
మహబూబాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి రెండు, మూడు గంటల ప్రయాణంలోనే చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక వైభవం, అభయారణ్యాలను ఆస్వాదించాలంటే ఉమ్మడి వరంగల్, మానుకోటను సందర్శించాల్సిందేనని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం పర్యాటక బ్రోచర్‌ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మానుకోట జిల్లా పరిధిలోని బయ్యారం పెద్దచెరువు, బీమునిపాద జలపాతం, పురాతన ఆలయాలు, ఏడు బావులు, ఇతర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు. పర్యాటక ప్రాంతాల పరిచయంలో భాగంగా 100 ప్రదేశాలను వీకెండ్ డెస్టినేషన్‌లుగా మార్చేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ సరికొత్త ప్రయత్నం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి శివాజీ, డీపీఆర్వో రాజేంద్ర ప్రసాద్, టూరిజం ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ లోకేఽశ్వర్ పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు
మహబూబాబాద్ రూరల్: మహబూబాద్ వ్యవసాయ మార్కెట్‌కు నాలుగు రోజులు సెలవులు ప్రకటించామని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ బుధవారం తెలిపారు. క్రిస్మస్, బా క్సింగ్ డే సందర్భంగా గురు, శుక్రవారం, వా రాంతపు సెలవుల సందర్భంగా శని, ఆది వా రాల్లో వ్యవసాయ మార్కెట్‌లో క్రయవిక్రయాలు బంద్ ఉంటాయన్నారు. రైతులు నాలుగు రోజుల సెలవుల విషయాన్ని గమనించి తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావొద్దని ఆయన కోరారు. మళ్లీ సోమవారం నుంచి వ్యవసాయ మార్కెట్‌లో క్రయవిక్రయాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
ఉత్తమ సేవలకు ప్రశంసపత్రాలు
మహబూబాబాద్ రూరల్ : జిల్లా పోలీసు సిబ్బంది సీసీటీఎన్‌ఎస్/ఐటీ ఆధారిత వ్యవస్థల్లో ఉత్తమ ప్రతిభ చూపినందుకు బుధవారం రాష్ట్ర అదనపు డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) వీవీ.శ్రీనివాసరావు చేతుల మీదుగా అభినందనలు పొంది, ప్రశంసపత్రాలు స్వీకరించారు. జిల్లా నుంచి ఐటీ కోర్ టీం సభ్యులు ఎం.సంతోష్ కుమార్, జి.కిశోర్ కుమార్, టెక్ టీం రైటర్లు ఉమ (డబ్ల్యూపీసీ, రూరల్ పోలీస్ స్టేషన్), వై.శ్రావణ్ కుమార్ (డోర్నకల్ పోలీస్ స్టేషన్) హైదరాబాద్‌లోని పోలీసు శాఖ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రశంసపత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్‌లో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి పోలీసు శాఖ పనితీరును మరింత మెరుగుపరచాలని ఆకాంక్షించారు.
27న రిజిస్ట్రేషన్ మేళా
మహబూబాబాద్: జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం ఈనెల 27న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌లు, రిజిష్ట్రేషన్‌మేళా నిర్వహించనున్నట్లు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ధర్మేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 27న కలెక్టరేట్‌లోని గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆహార వ్యాపార నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చే సుకోవాలన్నారు. ఈ మేళాలో రెన్యూవల్ కూడా చేస్తారని చెప్పారు. పూర్తి వివరాల కోసం 90002 84353 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
పర్యాటక బ్రోచర్ ఆవిష్కరణ


