రైల్వే ప్రాజెక్టు సాఽధించుకుందాం
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ జిల్లాలో రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపోను అందరి సహకారంతో సాధించుకుందామని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. మహబూబాబాద్ రైల్వే సాధన కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ని సెక్రటేరియట్‌లో అఖిలపక్ష పార్టీల నాయకులు బుధవారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మానుకోటలోనే డిపో ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎంపీ పొరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, అఖిలపక్ష పార్టీల నాయకులు భరత్‌చందర్‌రెడ్డి, సాదుల శ్రీనివాస్, బి.విజయసారథి, మార్నేని వెంకన్న, డోలి సత్యనారాయణ, పిల్లి సుధాకర్, గుగ్గిళ్ల పీరయ్య, దార్ల శివరాజ్, కొత్తపల్లి రవి, తేళ్ల శ్రీనివాస్, నెహ్రూనాయక్, అజయ్‌సారథిరెడ్డి, రఘు, ఘనపురపు అంజయ్య, సూర్నపు సోమయ్య, ముత్యం వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.


