రైతును బురిడీ కొట్టించి రూ.40 వేలు డ్రా..
వర్ధన్నపేట: ఏటీఎం కేంద్రంలో ఓ రైతును దుండగుడు బురిడీ కొట్టించాడు. రైతు ఏటీఎం కార్డు మార్చి రూ.40 వేలు డ్రా చేసుకుని పరారయ్యాడు. ఈ ఘటన బుధవారం వర్ధన్నపేటలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన రైతు పిన్నింటి కిషన్‌రావు తన ధాన్యం డబ్బులు ఖాతాలో జమ కావడంతో ఎస్‌బీఐకి వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవడానికి అధికారులను సంప్రదించాడు. అయితే బ్యాంకులో డబ్బులేదని ఏ టీఎం ద్వారా డ్రా చేసుకోవాలని వారు సూచించారు. కిషన్‌రావుకు ఏటీఎం వినియోగం తెలియకపోవడంతో అక్కడే ఉన్న ఓ గుర్తు తెలి యని వ్యక్తికి తన ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బులు డ్రా చేయాలని కోరాడు. అతడికి తన పిన్ నంబర్ చెప్పాడు. అయితే ఏటీఎం కార్డు పని చే యడం లేదని దుండగుడు.. కిషన్‌రావును న మ్మించాడు. అనంతరం మరో ఏటీఎం కార్డు ఇవ్వగా కిషన్‌రావు అక్కడి నుంచి వెళ్లి పోయా డు. తన ఏటీఎం కార్డు పని చేయడం లేదని బ్యాంకు సిబ్బందికి తెలిపి తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును చూపాడు. ఆ కార్డును చూసిన సి బ్బంది కిషన్‌రావుకు చెందిన కాదని, డుప్లికేట్‌గా గుర్తించారు. వెంటనే కిషన్‌రావు ఖాతాను పరిశీలించగా అప్పటికే ఏటీఎం కార్డు ద్వారా రూ.40 వేలు వేరే ఏటీఎం దగ్గర నుంచి డ్రా చే సినట్లు గుర్తించారు. ఈ విషయం కిషన్‌రావుకు తెలపడంతో లబోదిబోమన్నాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించి విచారణ చేపట్టారు.
ఏటీఎం కార్డు మార్చి ఇచ్చిన దుండగుడు
అనంతరం మరో ఏటీఎంలో డబ్బులు డ్రా


