బోడమంచ తండాలో ఉద్రిక్తత..
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ తండాలో బుధవారం ఉద్రికత్త చోటు చేసుకుంది. భుక్య వీరన్న అనే వ్యక్తిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని తండావాసులు ఆందోళన చేపట్టారు. భుక్య వీరన్న హత్యకు మృతుడి భార్య విజయ, ఇదేతండాకు చెందిన బోడ బాలోజీ, అతడి స్నేహితుడు, ఆర్‌ఎంపీ ధర్మారపు భరత్ కారణమని ఆరోపిస్తూ బాలోజీ, విజయ ఇళ్లపై దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇటుక విసరడంతో అక్కడున్న సెకండ్ ఎస్సై నరేశ్, కానిస్టేబుల్ నరేశ్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే మానుకోటలో ఓ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆర్‌ఎంపీ భరత్‌కు చెందిన బైక్‌ను తండావాసులు దగ్ధం చేశారు. అతడు ఉండే గుమ్చిని సైతం ధ్వంసం చేశారు. ఘటనా స్థలికి మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, రూరల్, కేసముంద్రం సీ ఐలు సర్వయ్య, సత్యనారాయణ, కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు ఎస్సైలు క్రాంతికిరణ్, కరుణాకర్, రమేశ్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చో టుచేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు.
హత్య ఘటనలో
అనుమానితుల ఇళ్లపై దాడికి యత్నం


