రైల్వే రవాణాకు వర్షం ఎఫెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

రైల్వే రవాణాకు వర్షం ఎఫెక్ట్‌

Aug 29 2025 6:32 AM | Updated on Aug 29 2025 6:32 AM

రైల్వే రవాణాకు వర్షం ఎఫెక్ట్‌

రైల్వే రవాణాకు వర్షం ఎఫెక్ట్‌

కాజీపేట రూరల్‌: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే అధికారి పలు రైళ్లను దారి మళ్లించగా మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. గు రువారం కాజీపేట రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ అగ్గి రవీందర్‌, సీపీఆర్‌ఓ శ్రీధర్‌ మాట్లాడుతూ కాజీపేట నుంచి బల్లార్షా వెళ్లే రెండు ప్యాసింజర్‌ రైళ్లు, డైలీ రామగిరి ప్యాసింజర్‌, కాజీపేట–బల్లార్షా వెళ్లే డైలీ అజ్నీ ప్యాసింజర్‌ రైళ్లను శుక్రవారం రద్దు చేస్తున్నామన్నారు. అలాగే కాజీపేట జంక్షన్‌ మీదుగా ప్రయాణించే 8 ఎక్స్‌ప్రస్‌ రైళ్లను శుక్రవారం వయా పెద్దపల్లి, పెద్దపల్లి, కరీంనగర్‌ మీదుగా దారి మళ్లించి నడిపిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్‌–తిరుపతి (17405) కృష్ణా ఎక్స్‌ప్రెస్‌, నర్సాపూర్‌–నాగర్‌సోల్‌ (12787) ఎక్స్‌ప్రెస్‌, ముంబాయి–లింగంపల్లి (17057) ఎక్స్‌ప్రెస్‌, ఓకా–రామేశ్వరం (16734) ఎక్స్‌ప్రెస్‌, లింగంపల్లి–ముంబాయి (17058) ఎక్స్‌ప్రెస్‌, బిజికెటి–కాచిగూడ (17606) ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌–జైపూర్‌ (12720) ఎక్స్‌ప్రెస్‌, కాచిగూడ–బిజికెటి (17605) ఎక్స్‌ప్రెస్‌ను వయా కాజీపేట బైపాస్‌ లైన్‌ మీదుగా పెద్దపల్లి, కరీంనగర్‌, ఆర్మూర్‌, నిజమాబాద్‌ మీదుగా దారి మళ్లించి నడిపిస్తున్నట్లు తెలిపారు. అలాగే కాజీపేట–సిర్‌పూర్‌ టౌన్‌ (17003) వెళ్లే ప్యాసింజర్‌, కరీంనగర్‌–సిర్‌పూర్‌టౌన్‌ (67772) వెళ్లే పుష్‌పుల్‌, సిర్‌పూర్‌టౌన్‌–కరీంనగర్‌ (67771) వెళ్లే పుష్‌పుల్‌ రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలంరోడ్‌–బల్లార్షా (17033) వెళ్లే సింగరేణి కాజీపేట–బల్లార్షా మధ్య, సిర్‌పూర్‌టౌన్‌–భద్రాచలంరోడ్‌ (17034) వెళ్లే సింగరేణి సిర్‌పూర్‌టౌన్‌–కాజీపేట, సికింద్రాబాద్‌–సిర్‌పూర్‌కాగజ్‌నగర్‌ (17233) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట–సిర్‌పూర్‌కాగజ్‌నగర్‌, సిర్‌పూర్‌కాగజ్‌నగర్‌– సికింద్రాబాద్‌ (17234) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ సిర్‌పూర్‌కాగజ్‌నగర్‌– కాజీపేట మధ్య రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

పలు రైళ్లు రద్దు,

మరికొన్ని దారి మళ్లింపు

కాజీపేట జంక్షన్‌లో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు

కాజీపేట జంక్షన్‌లో రైల్వే హెల్ప్‌డెస్క్‌

వర్షాల కారణంగా కాజీపేట జంక్షన్‌ మీదుగా అప్‌ అండ్‌ డౌన్‌ రూట్‌లో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లించి నడిపిస్తున్న నేపథ్యంలో రైల్వే అధికారులు కాజీపేట జంక్షన్‌లో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. రైళ్ల రద్దు, దారి మళ్లింపు, పాక్షికంగా రద్దు, ఆలస్యంగా నడిచే రైళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలియజేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement