
విద్యుత్ పునరుద్ధరణకు అహర్నిశలు కృషి
హన్మకొండ: భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు విద్యుత్ అధికారులు, ఉ ద్యోగులు అహర్నిశలు శ్రమిస్తున్నారని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన భారీ వర్షాలు కురిసిన కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ని ర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో పర్యటించారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కా మారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ సర్కి ల్ పరిధిలో నేలకూలని 108 విద్యుత్ స్తంభాలకు 87 స్తంభాలు పునరుద్ధరించామని, 21 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లకు 17 సరి చేశామని, 86 ట్రాన్స్‌ఫార్మర్‌లు నీట మునుగగా 6 ట్రాన్స్‌ఫార్మర్లు పునరుద్ధరించామన్నారు. భారీ వరద, ముంపుతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. విద్యుత్ పునరుద్ధరణకు బ్రేక్‌డౌన్ టీం సిద్ధంగా ఉందని, రేయింబవళ్లు నిబద్ధతతో పని చేస్తున్నారన్నారు. కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో లోడ్ మానిటరింగ్ సెల్ కంట్రోల్‌రూంను పరిశీలించి వర్షాలతో విద్యుత్ సరఫరా, సబ్ స్టేషన్ల పనితీరు, స్తంభాలు, లైన్ల పనితీరు, స్థితిగతులను తనిఖీ చేశారు. వర్షాలతో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు సెలవులు తీసుకోవద్దని ఆదేశించారు.
ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి