గిరిజన సాహసకుడి విజయం | - | Sakshi
Sakshi News home page

గిరిజన సాహసకుడి విజయం

May 10 2025 8:18 AM | Updated on May 10 2025 8:18 AM

గిరిజ

గిరిజన సాహసకుడి విజయం

మిజోరంలోని ఫాంగ్‌పుయ్‌ పర్వతం అధిరోహించిన యశ్వంత్‌

మరిపెడ రూరల్‌: మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన గిరిజన యువ మౌంటైనర్‌ యశ్వంత్‌ మరో అరుదైన సాహసాన్ని విజయవంతం చేశాడు. ఇటీవల మణిపూర్‌ రాష్ట్రంలోని ఎత్తైన పర్వతం ఇసో (2,994 మీటర్లు)ను అధిరోహించి రికార్డు సొంతం చేసుకోగా, తాజాగా 2,157 మీటర్ల ఎత్తైన ఫాంగ్‌ పుయ్‌ (బ్లూ మౌంటైన్‌) పర్వతాన్ని యశ్వంత్‌ అధిరోహించి శుక్రవారం మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పలు పర్వతాలను మౌంటైనర్‌ యశ్వంత్‌ అధిరోహించి గిరిజన పిన్న వయస్సు సాహసకుడిగా ప్రసిద్ధికెక్కాడు. జాతీయ మిషన్‌ ‘హర్‌ శిఖర్‌ పర్‌ తిరంగా’ మిషన్‌ కింద భారత దేశంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, మణిపూర్‌, రాజస్థాన్‌, మిజోరాం రాష్ట్రాల్లోని అతి ఎత్తైన పర్వతాలను సులువుగా అధిరోహించాడు. శిఖరాగ్ర సమావేశం నుంచి డ్రగ్స్‌కు నో చెప్పండి, బెట్టింగ్‌ యాప్‌లకు నో చెప్పండి, జీవితానికి అవునని చెప్పిండి అంటూ భారతదేశ యువతకు మౌంటైనర్‌ యశ్వంత్‌ స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇస్తూ ఫాంగ్‌ పుయ్‌ పర్వతంపై తివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. యశ్వంత్‌ తన ధైర్యసాహసాలతో ఇప్పటికే 28 రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన పర్వతాలు అధిరోహించాడు. అదేవిధంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కిలిమంజారో, ఎల్బస్‌, మౌంట్‌ కోస్కియుస్కో తదితర పర్వతాలను చుట్టేసి దేశఖ్యాతిని ప్రపంచానికి చా టాడు. చివరికి ప్రపంచంలోని ఏడు శిఖరాగ్ర సమావేశాలను పూర్తి చేయడంతో పాటు భారతదేశ యువతకు ప్రపంచ స్థాయికి ప్రాతి నిధ్యం వహించడమే జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు యశ్వంత్‌ వివరించాడు.

కానిస్టేబుళ్లకు సీపీ అభినందన

వరంగల్‌ క్రైం: అత్యధికసార్లు రక్తదానం చేసిన వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగంలో కానిస్టేబుల్‌ కన్నె రాజు, కేయూ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రవీందర్‌ను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ అభినందించారు. వరల్డ్‌ రెడ్‌ క్రాస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సుబేదారి రెడ్‌క్రాస్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కన్నె రాజు 37వ సారి, రవీందర్‌ 18వ సారి స్వచ్ఛందంగా రక్తదానం చేయగా.. వారిని సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు.

14 కిలోల గంజాయి పట్టివేత

కాజీపేట: కాజీపేట రైల్వే జంక్షన్‌ ఆవరణలో 14.7 కిలోల ఎండు గంజాయిని శుక్రవారం ఎకై ్సజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో సీఐ వేముల చంద్రమోహన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షహనావాస్‌ కాశీం ఆదేశం మేరకు జిల్లా డిప్యూటీ కమిషనర్‌ అంజన్‌రావు పర్యవేక్షణలో రైల్వే జంక్షన్‌లో తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఒడిశా నుంచి వచ్చే రైళ్లలో గంజాయి రవాణా జరుగుతున్నట్లుగా అందిన ముందస్తు సమాచారం ఆధారంగా రైళ్లలో తనిఖీలు చేపట్టారు. అనంతరం జంక్షన్‌లో ఓ బ్యాగు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆగి తనిఖీ చేయగా.. రూ.90 వే లు విలువైన గంజాయి లభించగా కేసు నమోదు చే శారు. ఎస్సై తిరుపతి, ఖలీల్‌, లాలయ్య, కోటిలింగం, ఆయుర్‌, రషీద్‌ పాల్గొన్నారు.

గిరిజన సాహసకుడి విజయం1
1/3

గిరిజన సాహసకుడి విజయం

గిరిజన సాహసకుడి విజయం2
2/3

గిరిజన సాహసకుడి విజయం

గిరిజన సాహసకుడి విజయం3
3/3

గిరిజన సాహసకుడి విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement