మిజోరాం గవర్నర్‌ను కలిసిన మౌంటైనర్ యశ్వంత్
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండా గ్రామ పంచాయతీకి చెందిన మౌంటైనర్ భూక్య యశ్వంత్ మిజోరాం గవర్నర్ డాక్టర్ విజయ్‌కుమార్ సింగ్‌ను రాజ్‌భవన్‌లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ మిషన్ ‘హర్ శిఖర్ పర్ తిరంగ’లో భాగంగా యశ్వంత్ మిజోరం వెళ్లాడు. అక్కడ గవర్నర్‌ను కలువగా.. తన వంతు ప్రోత్సాహం, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, విజయం వైపు దూసుకెళ్లాలని యశ్వంత్‌కు సూచించారు.
ఫోన్ పే హ్యాక్
● రూ.63వేలు మాయం
కాటారం: ఫోన్ పే హ్యాక్ అవడం ద్వారా రెండు బ్యాంక్ ఖాతాల్లో నుంచి రూ.63 వేలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కంకణాల సురేందర్‌రెడ్డి స్రవంతిలకు చెందిన రెండు మొబైల్స్‌కు అపరిచిత నంబర్ నుంచి లింకులు వచ్చాయి. వారి కుమార్తె ఆ లింక్‌లను ఓపెన్ చేయడంతో ఫోన్‌పే ద్వారా పలుమార్లు ఖాతాలోని డబ్బులు డెబిట్ అయ్యాయి. సురేందర్‌రెడ్డి ఫోన్‌పేకు చెందిన ఖాతా నుంచి రూ.33 వేలు, స్రవంతి ఫోన్‌పేకు చెందిన ఖాతా నుంచి రూ.30 వేలు పలుమార్లు డెబిట్ కావడంతో ఖాతాలు ఖాళీ అయ్యాయి. మెసేజ్‌లు రావడంతో గమనించిన సురేందర్‌రెడ్డి ఆందోళనకు గురై చివరకు ఫోన్‌పే హ్యాక్ అయినట్లు గుర్తించి బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
శతాధిక వృద్ధురాలికి
జన్మదిన వేడుకలు
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బుర్హాన్‌పురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు జాగాటి వెంకటనర్సమ్మ 100వ జన్మదిన వేడుకలను బంధువుల మధ్య బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కుమారులు వెంకటయ్య, వీరస్వామి, కుమార్తెలు ఉపేంద్ర, సత్తెమ్మ, మనుమలు, మనమరాళ్లు బంధువులు పాల్గొన్నారు.
యువకుడి ఆత్మహత్య
జనగామ రూరల్: కారుకొనివ్వలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామలోని మరిగడి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కూరాకుల కనుకయ్య కుమారుడు కూరాకుల సాయిరాజ్ (22) డ్రైవింగ్ చేసుకునేవాడు. ఈక్రమంలో డ్రైవింగ్ చేయడానికి కారు కొనివ్వమని కొంతకాలంగా తల్లిదండ్రులను కోరాడు. వారు డబ్బులు లేవని నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన సాయిరాజ్ తీవ్ర మనోవేదనకు గురై ఎవరూ లేని సమయంలో తన బావి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయిరాజ్ తండ్రి కనకరాజు ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు.
మిజోరాం గవర్నర్‌ను కలిసిన మౌంటైనర్ యశ్వంత్
మిజోరాం గవర్నర్‌ను కలిసిన మౌంటైనర్ యశ్వంత్


