బోర్డు తిప్పేసిన పరపతి సంఘం
ఖిలా వరంగల్ : నిరుపేదలు కష్టపడి కరుణ పరపతి సంఘంలో నెలవారిగా పొదుపు చేసుకున్నారు. కానీ సంఘం నిర్వాహకుడు రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి బోర్డు తిప్పేసి కుటుంబ సమేతంగా పరారయ్యాడు. వరంగల్ 41వ డివిజన్ కాశికుంటలో ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలియడంతో బాధితులు నిర్వాహకుడు వెంకటయ్య ఇంటికి అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఇంటికి తాళం వేసి ఉండటం, సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో మోసపోయామని గ్రహించి ఆందోళన చేపట్టారు. మిల్స్‌కాలనీ పోలీసుల ఘటన స్థలానికి చేరుకుని ఫిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా బాధితుడు పుట్ట మనోహార్ మాట్లాడుతూ.. కాశికుంటలో వెంకటయ్య ఆరేళ్ల క్రితం కరుణ పరపతి సంఘం ఏర్పాటు చేయగా 600 మంది సభ్యులుగా చేరారు. నెలకు వాటాధనం చెల్లిస్తూ వస్తున్నారు. కొంత కాలంగా వెంకటయ్య సభ్యులకు లోన్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాడు. చివరికి ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా పరారయ్యాడని తెలిపారు. వెంకటయ్యపై మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని ఆయన పేర్కొన్నారు.
ఇంటికి తాళం వేసి నిర్వాహకుడి పరార్
సంఘం సభ్యుల ఆందోళన


