దేశం కోసం పోరాటంలో ముందుండాలి
మహబూబాబాద్ రూరల్ : విజయమో.. వీర స్వర్గమో.. యుద్ధమంటూ వస్తే వెనకడుగు వేయకుండా శత్రువులతో పోరాడేందుకు ముందుండాలని మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి హనుమాన్ దేవాలయంలో జవాన్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. పహల్గాం ఉగ్రదాడిని యావత్ ప్రపంచ దేశాలతో పాటు దేశమంతటా నిరసనలతో ఖండిస్తున్నారు. ఒకవేళ యుద్ధం వస్తే పోరాటంలో తమ పుత్రులు ముందు వరుసలో ఉండాలని జవాన్ల తల్లిదండ్రులు పేర్కొన్నారు. జవాన్లకు ధైర్యం చెబుతూ జరుగబోయే యుద్ధంలో పాల్గొంటున్నందుకు గర్వంగా ఉందని జవాన్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గర్వంతో చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో కొలిశెట్టి సత్యనారాయణ, మలికంటి సైదమ్మ, వద్దుల జయమ్మ, పబ్బోజు రమాదేవి, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
కంబాలపల్లిలో జవాన్ల తల్లిదండ్రుల పూజలు


