మౌంటైనర్ మరో సాహసం
● మణిపూర్‌లోని ఇసో పర్వతాన్ని అధిరోహించిన యశ్వంత్
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన మౌంటైనర్ యశ్వంత్ మరో అరుదైన సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. మణిపూర్ రాష్ట్రంలోని ఎత్తైన పర్వతం ఇసో 2,994 మీటర్ల ఎత్తును ఆదివారం అధిరోహించి మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. యశ్వంత్ ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పలు పర్వతాలను అధిరోహించి పిన్న వయస్సు గిరిజన సాహసకుడిగా పేరు తెచ్చుకున్నాడు. జాతీయ మిషన్ ‘హర్ శిఖర్ పర్ తిరంగా’లో మౌంటైనర్ యశ్వంత్.. ఇసో అస్సాం రైఫిల్ 16వ బెటాలియన్‌కు చెందిన కల్నల్ సందీప్ శర్మ, లెఫ్ట్‌నెంట్ కల్నల్ సిద్ధార్థ్ తో కలిసి ఇసో పర్వతంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. యశ్వంత్ ఇప్పటికే కిలిమంజారో, ఎల్బస్, మౌంట్ కోస్కియుస్కో పర్వతాలను చుట్టేసి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటడం గొప్ప విషయం.


