అంకితభావంతో విధి నిర్వహణ
మహబూబాబాద్ రూరల్: జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. పదవీ విరమణ పొందిన అధికారులను బుధవా రం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన అధికారులు తమ జీవితంలో ముఖ్యమైన భాగాన్ని పోలీసుశాఖకు అంకితం చేశారన్నారు. పదవీ విరమణ పొందిన వారిలో మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఏఎస్సై పెద్దిరెడ్డి రమేశ్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగం ఏఎస్సై భూక్య కిషన్, కొత్తగూడ ఏఎస్సై సోమ కుమారస్వామి, గంగారం హెడ్ కానిస్టేబుల్ స్వర్ణపాక పాపయ్య, డీసీఆర్బీ ఏఎస్సై మహమ్మద్ అహ్మద్ ఉన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు తిరుపతిరావు, మోహన్, విజయ్ ప్రతాప్, సీఐలు నరేందర్, సరవయ్య, సత్యనారాయణ, ఆర్‌ఐలు నాగేశ్వరరావు, అనిల్ ఉన్నారు.


