ఇంటర్ వర్సిటీ సాఫ్ట్‌బాల్ టోర్నీకి మహిళా జట్టు
కేయూ క్యాంపస్ : ఏపీలోని నెల్లూరులో గల విక్రమసింహపురి యూనివర్సిటీలో ఈనెల 30నుంచి మే 5వ తేదీవరకు జరుగనున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు కాకతీయ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ ఉమెన్ జట్టు పాల్గొననుందని కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య మంగళవారం తెలిపారు. ఈ జట్టులో ఎం.అనుబిందు (న్యూసైన్స్ డిగ్రీ కాలేజీ హనుమకొండ), టి.స్పందన (మాతృశ్రీ, డిగ్రీ కాలేజీ, భీమారం), ఎ.అనూష (వీసీపీఈ, బొల్లికుంట), ఎస్.సుమిత్రా (కాకతీయ డిగ్రీ కాలేజీ, హనుమకొండ), జి.పూజ, సీహెచ్ రమ, ఆర్.భాగ్యశ్రీ (యూసీపీఈ కేయూ), జె.దుర్గాభవాని, ఎన్.సాయిప్రసన్న (వీసీపీఈ, బొల్లికుంట), ఎ.నందిని, బి.అరవింద (టీజీటీడబ్ల్యూఆర్‌డీసీ, కొత్తగూడెం), పి.సొనాలి (టీజీడబ్ల్యూఆర్‌డీసీ, ఆసిఫాబాద్), పి.నాగలక్ష్మి (ఆర్డీ కాలేజీ, హనుమకొండ), ఎన్.శైలజ (యూసీపీఈ కేయూ, ఖమ్మం), ఎ.అర్చన (వరంగల్ కిట్స్), టి.శ్యామల (యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కాలేజీ హనుమకొండ) ఉన్నారని వెంకయ్య పేర్కొన్నారు. ఈ జట్టుకు కోచ్‌గా ఎ.రాజేష్, మేనేజర్‌గా పి.లక్ష్మిపతి వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు.


