గులాబీ వాహనాల జాతర
జనగామ: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు గులాబీ దళం ఉద్యమ కెరటం కదిలింది. నాగర్‌కర్నూల్ నుంచి జనగామ వరకు వేలాది వాహనాలు వరంగల్–హైదరాబాద్ నేషనల్ హైవేపై కదులుతుంటే చీమల దండును తలపించింది. సెకనుకు 50 వాహనాల చొప్పున.. రోడ్డుపై గ్యాబ్ లేకుండా రయ్ రయ్ మంటూ పరుగెత్తాయి. డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యంలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట ఏసీపీల పర్యవేక్షణలో సీఐ, ఎస్సై, పోలీసు బలగాలు పెద్ద ఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టాయి. నాగర్‌కర్నూల్, వనపర్తి, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట, జనగామ జిల్లాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి ఎల్క తుర్తి బహిరంగ సభకు వెళ్లాయి. రఘునాథపల్లి మండలం కోమళ్ల, దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్‌గేట్ల వ ద్ద ఎలాంటి రుసుం తీసుకోకుండా గేట్లను తెరిచి ఉంచారు. దీంతో కొంత మేర ట్రాఫిక్‌ను నియంత్రించగలిగారు. సభ ముగిసిన తర్వాత అర్థరాత్రి వరకు హైవేపై వాహనాల రద్దీ కొనసాగింది. పోలీసులు, నిఘా వర్గాలు తెల్లవారు జాము వరకు నేషనల్ హైవేపై బందోబస్తు చర్యలు చేపట్టారు.
హైవేపై సెకనుకు 50కి పైగానే..
అడుగడుగునా పోలీసు నిఘా
రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన జనం
గులాబీ వాహనాల జాతర


