డబుల్‌ లొల్లి | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ లొల్లి

Apr 25 2025 12:51 AM | Updated on Apr 25 2025 12:51 AM

డబుల్

డబుల్‌ లొల్లి

శుక్రవారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

10లోu

అనుశ్రీని అభినందించిన ఎస్పీ

మహబూబాబాద్‌ రూరల్‌: ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన హోంగార్డు తిరుపతి కూతురు అనుశ్రీని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ గురువారం అభినందించారు. మహబూబాబాద్‌ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో హోంగార్డు విధులు నిర్వహిస్తున్న మదాసు తిరుపతి కూతురు అనుశ్రీ ఇంటర్‌ ఎంపీసీ మొదటి సంవత్సరంలో 468 మార్కులు సాధి ంచింది. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో విద్యార్థిని అనుశ్రీని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి భవిష్యత్‌లో ఉన్నత చదువులు చదివి మంచిస్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, ఆర్‌ఐలు భాస్కర్‌, సోములు, హోంగార్డు యూనియన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

జడ్జిని కలిసిన కలెక్టర్‌

మహబూబాబాద్‌ రూరల్‌: జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్‌ అబ్దుల్‌ రఫీని కలెక్టర్‌ అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి జిల్లాకు సంబంధించిన పలు అంశాల గురించి కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.

కొనుగోలు కేంద్రాల తనిఖీ

డోర్నకల్‌: డోర్నకల్‌తో పాటు పలు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆర్‌డీఏ ఆర్డీఓ మురళీధర్‌రాజు గురువారం తనిఖీ చేశారు. డోర్నకల్‌, వెన్నారం, తహసీల్దారు బంజర గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో అసరమైన పరికరాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌ లు, సీసీలు సక్రమంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం శంకర్‌నాయక్‌, సీసీలు పాల్గొన్నారు.

నిట్‌లో వరల్డ్‌ డీఎన్‌ఏ డే వేడుకలు

కాజీపేట అర్బన్‌ : నిట్‌ వరంగల్‌లో సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఫెసిలిటీ(సీఆర్‌ఐఎఫ్‌), యునైటెడ్‌ బయోలాజికల్‌ అండ్‌ థర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ సంస్థల సౌజన్యంతో గురువారం వరల్డ్‌ డీఎన్‌ఏ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయోలాజీ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఎగ్జిబిషన్‌ను డీన్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌ శ్రీనివాసాచార్య ప్రారంభించి మాట్లాడారు. డీఎన్‌ఏ పరిశోధనల్లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాల ఉపయోగంపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకునేందుకు ఈ ఎగ్జిబిషన్‌ తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు వీరేష్‌బాబు, పీవీ శ్రీలక్ష్మి, రవికుమార్‌ పాల్గొన్నారు.

సాక్షి, మహబూబాబాద్‌: గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను అధికారికంగా కేటాయించకపోవడంతో లొల్లి మొదలైంది. కాగా, ప్రభుత్వం మారడంతో నిర్మాణాలు పూర్తయిన ఇళ్లు, నిర్మాణంలో ఉన్న వాటిని కొత్త లబ్ధిదారులకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, గత ప్రభుత్వం నామమాత్రంగా కేటాయించిన లబ్ధిదా రులు అందోళనకు దిగుతున్నారు. తమకు కేటాయి ంచిన ఇళ్లకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు పోనూ రూ.2లక్షల మేరకు ఖర్చు చేశామని, ఇప్పుడు కాదంటే ఎలా.. చావనైనా చస్తాం.. ఇల్లు మాత్రం విడిచి పెట్టబోమని ఆందోళనకు చేస్తున్నారు.

975 ఇళ్లు నిరుపయోగంగా...

పేదలకోసం నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను పలుచోట్ల పంపిణీ చేయలేదు. దీంతో ఆ ఇళ్లలో సర్కారు తుమ్మలు, పిచ్చి మొక్కలు మొలచి అడవిని తలపిస్తున్నాయి. గత ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం మహబూబాబాద్‌ జిల్లాకు రూ. 287.24కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లా వ్యాప్తంగా 5,415 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 2,773 ఇళ్లు పూర్తికాగా..1,798 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించారు. ఇందులో 1,728 కుటుంబాలు ఇళ్లలోకి చేరగా.. 975 ఇళ్లు నిర్మాణం పూర్తి అయినా నిరుపయోగంగా మారాయి.

కట్టుకొమ్మన్నారని..

పట్టణాల్లోని ప్రభుత్వ స్థలాల్లో జీప్లస్‌టు భవనాలు నిర్మించి లాటరీ పద్ధతిన పేదలకు కేటాయించారు. గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాలు, లేదా ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అయితే స్థానిక ఎమ్మెల్యే, ఇతర పార్టీ పెద్దలు, అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. నామమాత్రంగా ఇళ్లను కేటాయించారు. దీంతో తమకు కేటాయించిన ఇంటికి అదనంగా రూ. 2లక్షల మేరకు కాంట్రాక్టర్‌కు ఇచ్చి తమకు నచ్చినట్లు నిర్మించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో సదరు కాంట్రాక్టర్‌ లబ్ధిదారులు చెప్పిన విధంగా ఎత్తు పెంచడం, ఇతర మెటీరియల్‌ వినియోగించి నిర్మించారు. అయితే నిర్మాణాలు పూర్తి అయినా ఎమ్మెల్యే ఎన్నికల కోడ్‌ వచ్చేలోపు లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అధికారికంగా కేటాయించని డబుల్‌ బెడ్రూం ఇళ్లను ఎవరికి ఇవ్వవద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయలేదు. అయితే గతంలో నామమాత్రంగా పేర్లు ప్రకటించిన వారు తమ పేరునే డబుల్‌ బెడ్రూం ఇల్లు నిర్మించారని, అదనంగా మాకు ఖర్చు కూడా అయిందని ఇప్పుడు మాకే ఇల్లు ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. అదే విధంగా కొందరు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు అర్జీలు కూడా అందజేశారు. అయితే చివరికి ఇళ్లను ఎవరికి కేటాయిస్తారో వేచి చూడాల్సిందే.

డబుల్‌ బెడ్రూం ఇళ్ల వద్ద పోలీసులను అడ్డుకుంటున్న బాధితులు

వచ్చే నెల 20 నాటికి జిల్లా కమిటీలు.. పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఆదేశం

ఉమ్మడి వరంగల్‌ ఆరు జిల్లాలకు కొత్త అధ్యక్షులు

నేటినుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలు...

ఆరు జిల్లాలనుంచి టీపీసీసీ దృష్టికి కొత్తగా 20 మంది పేర్లు

అధ్యక్ష పదవి కోసం పావులు కదుపుతున్న ఆశావహులు

జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్విహించి నివాళులర్పిస్తున్న ఐఎంఏ సభ్యులు

నెహ్రూసెంటర్‌: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఐఎంఏ సభ్యులు కోరారు. జిల్లా కేంద్రంలో ఐఎంఏ, కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ తీసి నివాళులర్పించారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అలాగే భారత్‌ వికాస్‌ పరిషత్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, పహల్గాం మృతులకు నివాళులర్పించారు.

న్యూస్‌రీల్‌

ఇళ్ల వద్ద ఉద్రిక్తత..

చిన్నగూడూరు: గత ప్రభుత్వం హయాంలో మండల కేంద్రంలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల వద్ద గురువారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మండల కేంద్రానికి చెందిన పలువురు తాళాలు వేసి ఉన్న డబుల్‌బెడ్రూం ఇళ్లలోకి ఎలాంటి అనమతుల లేకుండా గురువారం ప్రవేశించారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్‌ మహబూబ్‌ అలీ, ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ అక్కడికి వెళ్లి ఖాళీ చేయాలని ఆదేశించారు. గతంలో తాము డబ్బులు చెల్లించామని, చావనైనా చస్తాం కానీ ఇళ్లు ఖాళీ చేయమని స్థానికులు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఇళ్లు నిర్మించి ఇంటి తాళాలు ఇచ్చారు. ఇప్పుడు ఇళ్లలోకి వెళ్తే ఖాళీ చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలో బాధితులు పెట్రోల్‌ డబ్బాలతో నిరసన చేపట్టారు. దీంతో భారీగా జనం గుమిగూడడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ కృష్ణకిషోర్‌, సీఐ రాజ్‌కుమార్‌ డబుల్‌ బెడ్రూం ఇళ్ల వద్ద భారీగా పోలీస్‌ సిబ్బందిని మోహరించారు. ఇళ్లలో ఉన్న వారి వివరాలను సేకరించారు. ఈ విషయమై డీఎస్పీ కృష్ణకిషోర్‌ను వివరణ కోరగా.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే శిక్షార్హులు అవుతారు. సమాజంలో ఉన్నప్పుడు చట్టాలను పాటించాలి. చట్టం ఎవరికీ చుట్టం కాదు. తహసీల్దార్‌ చెప్పినప్పుడు వినకపోతే ఎలా.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిని గుర్తించి ఇళ్లు ఇచ్చేలా న్యాయస్థానం చర్యలు తీసుకుంటుంది. కాదని అక్రమంగా ఇళ్లలోకి ప్రవేశిస్తే అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తామన్నారు.

కొత్త కేటాయింపులు చేయలేదు

గతంలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను అప్పుడు కేటాయించి ఆర్డర్‌ ఇచ్చిన వారికే హక్కు ఉంటుంది. ఆర్డర్‌ ఇవ్వకుండా ఇల్లు మాది అనడం సరికాదు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్ల కేటాయింపు జరుగుతుంది.

– వీరబ్రహ్మచారి, అదనపు కలెక్టర్‌

డబుల్‌ లొల్లి1
1/6

డబుల్‌ లొల్లి

డబుల్‌ లొల్లి2
2/6

డబుల్‌ లొల్లి

డబుల్‌ లొల్లి3
3/6

డబుల్‌ లొల్లి

డబుల్‌ లొల్లి4
4/6

డబుల్‌ లొల్లి

డబుల్‌ లొల్లి5
5/6

డబుల్‌ లొల్లి

డబుల్‌ లొల్లి6
6/6

డబుల్‌ లొల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement