తక్షణమే సస్పెండ్ చేయాలి
గంగారం: మహబూబాబాద్ జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా విధులు నిర్వహిస్తున్న గుగులోత్ దేశిరామ్‌ను సస్పెండ్ చేయాలని తుడుం దెబ్బ కార్యనిర్వాహక అధ్యక్షుడు పులసం మునేష్ కోరారు. గంగారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలోఆయన మాట్లాడుతూ.. సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో పనిచేస్తున్న ఆదివాసీ, గిరిజన ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులపై ప్రైవేట్ వ్యక్తులతో, ఆయా పాఠశాలలు, ఆశ్రమ వసతి గృహాలలో సమస్యలు లేకపోయిన ఉన్నట్లుగా పేపర్ స్టేట్‌మెంట్స్ ఇప్పిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. తక్షణమే డీడీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.


