రైతు సేవకే పునరంకితం కావాలి
మరిపెడ రూరల్: ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) కమిటీదేనని, ఆత్మ కమిటీ రైతు సేవకే పునరంకితం కావాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. సోమవారం మరిపెడ మండలంల గిరిపురం గ్రామ రైతు వేదికలో మరిపెడ డివిజన్ వ్యవసాయ అధికారి విజయ్ చందర్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికై న మరిపెడ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్‌రెడ్డితో పాటు 23 మంది కమిటీ డైరెక్టర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంటికొమ్ము యుగేందర్‌రెడ్డి, నూకల అభినవ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరరెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు తాజుద్దీన్, కాలం రవీందర్‌రెడ్డి, కాలం శ్రీనివాస్‌రెడ్డి, అఫ్జల్, ఉపేందర్ పాల్గొన్నారు.


