
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
● ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు
మహబూబాబాద్ అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత పెరిగిందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. జిల్లా ఇన్‌చార్జ్, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అందరిని సమన్వయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, అధిష్టానం ఆదేశాలు పాటించడం లేదన్నారు. నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో ఉంటేనే స్థానిక ఎన్నికల్లో గెలుస్తామన్నారు. వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ సభకు వేలాదిగా తరలిరావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ నుంచి రెండు లక్షలకు తగ్గకుండా సభకు హాజరవుతున్నారన్నారు. ఇప్పటికై నా మాజీ మంత్రి అందరూ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులను కలుపుకుని రజతోత్సవ సభ విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలోనే అన్ని సమావేశాలు నిర్వహించాలని కోరారు. ము న్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, మాజీ కౌన్సిలర్ ఎడ్ల వేణు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తేళ్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు గద్దె రవి ఉన్నారు.