
జేఈఈలో మెరిసిన ఎస్‌ఆర్ విద్యార్థులు
విద్యారణ్యపురి : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎస్‌ఆర్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జాతీయ స్థాయిలో వి.నాగసిద్ధార్ధ 5వ ర్యాంకు, పాటిల్‌సాక్షి 48వ ర్యాంకు, ఎం.అరుణ్ 60వ ర్యాంకు, ఎం.రవిచంద్రారెడ్డి 65వ ర్యాంకు సాధంచినట్లు ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. వై.భరణి శంకర్ 88వ ర్యాంకు, బాదావత్ సురేష్ 98, దాసరి ఫణీంద్ర 116, మోదెల్లా వెంకట కౌసిక్ 141, ఈర్ల బిందుశ్రీ 142, గుట్ట దిలీప్‌రెడ్డి 190, భూక్య వినోద్ 246, సీహెచ్ షణ్ముఖ సాయి 274, బి.ధనషన్ముఖ శ్రీ 410, కాగితపు దీపక్ 491, పుత్తూరు ఉజ్వల్ 509వ ర్యాంకు సాధించారని వారు వివరించారు. మే 18న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్ కు ఇప్పటివరకు 3,556 మందికి పైగా విద్యార్థులు ప్రవేశానికి అర్హత సాధించారని రాష్ట్రంలో ఎస్‌ఆర్ విజయపథాన్ని ఎగురవేశారని వారు తెలిపారు. ఓపెన్, అన్ని కేటగిరీలు కలిపి జాతీయస్థాయిలో 528, 567, 584, 647, 687, 707, 726, 740, 777, 826, 844, 969 ర్యాంకులను విద్యార్థులు సొంతం చేసుకున్నట్లు వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరింత అత్యుత్తమైన మార్కులు సాధించేలా తీర్చిదిద్దుతామని వారు ఆశాభావాన్ని వ్యక్తపర్చారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికి స్ఫూర్తిదాయకం కావాలని వారు ఆకాంక్షించారు.

జేఈఈలో మెరిసిన ఎస్‌ఆర్ విద్యార్థులు

జేఈఈలో మెరిసిన ఎస్‌ఆర్ విద్యార్థులు

జేఈఈలో మెరిసిన ఎస్‌ఆర్ విద్యార్థులు

జేఈఈలో మెరిసిన ఎస్‌ఆర్ విద్యార్థులు

జేఈఈలో మెరిసిన ఎస్‌ఆర్ విద్యార్థులు