మిర్చి కాంటాల్లో జాప్యం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి కాంటాల్లో జాప్యం జరుగుతుందని ఆరోపిస్తూ ఏఎంసీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు చంద్రయ్య, నరేశ్, భద్రు మాట్లాడుతూ.. మార్కెట్‌కు గురువారం ఉదయం మిర్చి విక్రయించేందుకు తీసుకువచ్చామని తెలిపా రు. శుక్రవారం ఉదయం మిర్చిని కొనుగోలు చేసిన వ్యాపారులు కాంటాలు పెట్టించడంలో జాప్యం చేశారని ఆరోపించారు. తమకంటే వెనకాల వచ్చి న రైతుల మిర్చి కొనుగోలు జరిపి కాంటాలు పెడుతున్నారని, తమను మాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, కార్యదర్శి షంషీర్ రైతులతో మాట్లాడారు. వెంటనే కాంటాలు పెట్టించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.


