ఆదివారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2025
– 9లోu
జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించి సంతోషంగా ముందుకు సాగాలని తెలియజేసేదే ఉగాది పచ్చడి పరమార్థం. షడ్రుచులంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. అలాగే సంతోషం, విచారం, ఐశ్వర్యం, పేదరికం, విజయం, పరాజయం ఆరు రుచుల మిశ్రమమే జీవితం. ఈ ఏడాది షడ్రుచుల సమ్మేళనంతో అందరి జీవితాలు సాగిపోవాలని ఆకాంక్షిస్తూ శ్రీవిశ్వావసు తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుదాం..
– హన్మకొండ కల్చరల్
జీవనయానంలో
ఎన్నో ఒడిదొడుకులు..
● జీవిత పరమార్థం తెలిపే ఆరు రుచులు
● ఉగాదికి కొత్తదారిలో అడుగులేద్దాం..
● శ్రీవిశ్వావసు తెలుగు
సంవత్సరాదికి స్వాగతం
ఆనందం..సంతోషం..
ఆనందం, సంతోషం తీపికి గుర్తులు. తల్లిదండ్రులు తమ పిల్లలతో సంతోషంగా జీవితాన్ని ఆస్వాదించాలి. మాటే మంత్రంగా ఎదుటివారిని నొప్పించకుండా మాట్లాడే తీరును అలవర్చుకోవాలి. పిల్లల కు నేర్పాలి. ప్రేమ, ఆప్యాయతలతో ఉండే పలకరింపుతోనే ఎదుటివారు మన మాటలు వినడానికి ఆసక్తి చూపుతారు. దానికి ఉదాహరణ స్వామి వివేకానందుడి చికాగో ప్రసంగం. పలువురి ప్రజాప్రతి నిధుల ప్రసంగాలు స్ఫూర్తినిస్తాయి. కుటుంబంలో తోడబుట్టిన వారు ఒకరికొకరు కష్టసుఖాలను పాలుపంచుకుంటూ సంతోషంగా గడపాలి. పిల్లలను సెల్‌ఫోన్‌కు దూ రంగా ఉంచుతూ బంధువులు, స్నేహితులతో పండుగ పనులలో భాగస్వాములను చేయడం, సంప్రదాయాలను పాటించేలా ఆధ్యాత్మిక నైతికవిలువలు నేర్పాలి. అది ఈ ఉగాది నుంచే మొదలుపెడదాం.
పట్టుదలతో ఐశ్వర్యం
చదువుల విషయంలో పిల్లలు అత్యుత్తమ ఫలితాలు పొందేలా విజేతలుగా నిలిచేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వారికి భారం తగ్గించేలా పార్ట్‌టైం జాబ్‌లు చేసి డబ్బు సంపాదించడం అలవర్చుకోవాలి. నగరంలో కాకతీయ మెడికల్ కాలేజీ దగ్గర కొందరు బీటెక్ విద్యార్థులు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మొబైల్ టిఫిన్ సెంటర్‌ను నడుపుతూ వారి తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నారు. కొత్త కొలువులు సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలి. ఆ కుటుంబం ఆర్థికంగా ఉన్నతంగా నిలుస్తుంది. యువకులు ఈ దిశగా పండుగరోజు తొలిఅడుగు వేయాలని ఆశిద్దాం.
విచారానికి విరుగుడు
ఇంట్లో, బయట ఉండే సమస్యల కారణంగా ఆరోగ్యంతోపాటు అందం, ఆనందం దూరమవుతాయి. సమస్యలను అధిగమించాలే కానీ విచారంతో జీవనాన్ని కొనసాగించవద్దు. వగరులాంటి విచారానికి విరుగుడుగా వాకింగ్ సంగీతం వినడం, మెడిటేషన్, యోగా వంటివి సాధన చేయాలి. ఇంట్లో బాధపడుతూ కూర్చోకుండా పనుల్లో నిమగ్నమవ్వాలి. ఇదే విషయాన్ని చిన్నప్పటినుంచి పిల్లలకు నేర్పాలి. మానసిక వికాసానికి క్రీడలు, వ్యాయామం ఎంత అవసరమో చెప్పాలి. వారికి ఇష్టమైన రంగంలో ప్రోత్సహించాలి. ఇందుకు ఉగాదిపండుగ రోజున నిర్ణయం తీసుకుందాం.
అపజయమే విజయానికి మెట్టు..
జీవితంలో అపజయం కలిగినప్పుడు బాధపడకుండా విజ యాన్ని అందుకోవడానికి ప్రయత్నించాలి. వ్యాపారంలో నష్టం కలిగినా, విద్యార్థులు పరీక్షల్లో పాస్ అవ్వకపోయినా, పోటీపరీక్షల్లో ఉద్యోగం సాధించకపోయినా మరో ప్రయత్నంలో విజయాన్ని సాధించవచ్చు. ఇప్పుడు గొప్పస్థానాల్లో ఉన్నవారంతా ఏదో ఒక తరగతిలో ఫెయిలై ఉండొచ్చు. అలా అని వారు లక్ష్యసాధనకు వెనుకడుగు వేయలేదు. ఓటమితో రెట్టింపు ఉత్సాహాన్ని తెచ్చుకుని ముందుకు సాగారు.
ఇఫ్తార్
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2025
ఆదివారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2025
ఆదివారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2025
ఆదివారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2025
ఆదివారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2025
ఆదివారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2025


