అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన తెలంగాణ తేజం! | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన తెలంగాణ తేజం!

Jul 8 2024 1:16 AM | Updated on Jul 8 2024 1:16 PM

-

పవర్‌లిఫ్టింగ్‌లో సుకన్యకు స్వర్ణ పతకం

మహబూబాబాద్‌: ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన ఆసియా, ఆఫ్రికా పవర్‌లిఫ్టింగ్‌ అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ తేజం మెరిసింది. మహబూబాబాద్‌ జిల్లా ఉమ్మడి కురవి మండలం జగ్యా తండాకు చెందిన తేజావత్‌ సుకన్య సత్తా చాటింది.

ఈనెల 3వ తేదీ నుంచి జరిగిన ఈ పోటీలో 76 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. కాగా, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి తనకు సాయపడిన కోమటిరెడ్డి ప్రతీక్‌ రెడ్డి ఫౌండేషన్‌కు, కోచ్‌ వీఎన్‌ రాజశేఖర్‌కు సుకన్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సుకన్య మాట్లాడుతూ తన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు.

దేనికి ధైర్యం కోల్పోకుండా క్రీడల్లో రాణిస్తున్నానని తెలిపారు. ఇందులో భాగంగా పవర్‌ లిఫ్టింగ్‌లోనే కాకుండా వెయిట్‌లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించానన్నారు. ఇంకా పతకాలు సాధించి దేశానికి పేరు తీసుకొస్తానని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement