లక్ష్మిప్రియను సన్మానిస్తున్న కలెక్టర్, జెడ్పీ చైర్మన్
హన్మకొండ: కళా ఉత్సవ్ జాతీయ విజేత లక్ష్మి ప్రియను హనుమకొండ జిల్లా జెడ్పీ చైర్మన్ డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్, కలెక్టర్ సిక్తా పట్నాయక్‌లు ఘనంగా సన్మానించారు. శనివారం హనుమకొండలోని జెడ్పీ కార్యాలయ సమావేశంహాల్‌లో జరి గిన కార్యక్రమంలో ఆమెకు శాలువా కప్పి, మొక్క, ప్రశంస పత్రం అందించి ఘనంగా సన్మానించారు. కాజీపేట మౌంట్ ఫోర్ట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ల క్ష్మి ప్రియ కళా ఉత్సవ్ పోటీల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూచిపూడి నృత్యంలో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ వేడుకలకు ఆహ్వానించడంతో పాటు పీఎం నరేంద్ర మోదీ ఎదుట నృత్యం చేసే అవకాశం లభించింది.
అధికారులు
అప్రమత్తంగా ఉండాలి
● టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ
గోపాల్ రావు
హన్మకొండ: అకాల వర్షాలతో అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీఎస్ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావు సూచించారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని టీఎస్ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి జనగామ, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ఎస్‌ఈ లు, డీఈలు, ఎస్‌ఏఓల సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాలు, డివిజన్‌లు, విభాగాల వారీగా ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ గోపాల్ రావు మాట్లాడుతూ వినియోగదారులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటూ సమస్యలు పరిష్కరించాలన్నారు. దత్తత తీసుకున్న గ్రామాల్లో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఉద్యోగులు విధిగా పని చేసే స్థలంలోనే నివాసముంటూ కాలిపోయిన, పని చేయని మీటర్లను మార్చాలన్నారు. విద్యుత్ బిల్లులు వంద శాతం వసూళ్లు చేయాలన్నారు. రాని బకాయిల సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిపై కేసులు బుక్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌లు బి. వెంకటేశ్వర్ రావు, పి.గణపతి, పి.సంధ్యారాణి, పి.మోహన్ రెడ్డి, వి.తిరుపతి రెడ్డి, సీజీఎంలు అశోక్ కుమార్, సదర్ లాల్, మోహన్ రావు, కిషన్, భీకంసింగ్ తదితరులు పాల్గొన్నారు.


