వైభవంగా ‘స్వర్ణరథోత్సవం’ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ‘స్వర్ణరథోత్సవం’

Nov 28 2026 1:02 AM | Updated on Nov 28 2026 1:02 AM

● శ్రీశైలంలో స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేపట్టారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించి ఉదయం 7.30గంటలకు స్వర్థరథోత్సవాన్ని ప్రారంభించారు.. రథం ముందు కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు ఆకట్టుకున్నాయి. స్వర్ణ రథోత్సవంలో శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఆలయ ఏఈఓ, అర్చకులు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement