కుట్రలు, కుతంత్రాలు ఎల్లకాలం సాగవు | - | Sakshi
Sakshi News home page

కుట్రలు, కుతంత్రాలు ఎల్లకాలం సాగవు

Nov 28 2026 1:02 AM | Updated on Nov 28 2026 1:02 AM

నంద్యాల(అర్బన్‌): కుట్రలు, కుతంత్రాలు ఎల్లకాలం సాగవు, ఇది టీడీపీ నాయకులు గ్రహించుకోవాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి హితవు పలికారు. నియోజకవర్గంలో నంద్యాల, గోస్పాడు మండలాల పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు మెజారిటీ స్థానాలను కై వసం చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నంద్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి నివాసం వద్ద విజయోత్సవ సంబరాలు మిన్నంటాయి. నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement