ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి

Nov 28 2026 1:02 AM | Updated on Nov 28 2026 1:02 AM

● మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి

ఆళ్లగడ్డ: ఎన్నికల్లో ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి నూతన సర్పంచులకు పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన పలువురు నూతన సర్పంచులు శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సర్పంచులను ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ ఆదేశాలతో పోలీసులు ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ధైర్యంగా ఎన్నికల్లో పోటీచేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులకు అందరికీ సెల్యూట్‌ అన్నారు. గెలుపొందిన సర్పంచ్‌లు గ్రామాల్లో పార్టీలకతీతంగా అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.

శిరివెళ్ల.. వైఎస్సార్‌సీపీ ఖిల్లా

బెదిరింపులు.. దౌర్జన్యాలు.. పోలీసులతో రాజీ యత్నాలు.. అన్నీ బెడిసికొట్టాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని అడ్డదారులు తొక్కినా శిరివెళ్ల మండలం వైఎస్సార్‌సీపీ ఖిల్లాగానే నిలిచింది. మొత్తం 16 గ్రామ పంచాయతీలు ఉండగా వైఎస్సార్‌సీపీకి పట్టు ఉన్న గోవిందపల్లె, బోయిలకుంట్ల, వెంకటాపురం పంచాయతీలను టీడీపీ నాయకులను పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడిన ఏకగ్రీవం చేసుకున్నారు. మిగిలిన 13 పంచాయతీలకు నామినేషన్లు వేయగా మండల కేంద్రం శిరివెళ్ల మేజర్‌ పంచాయతీలో పోలీసు ఉన్నతాధికారి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేయడంతో పోలింగ్‌ ఒక రోజు ముందు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఎన్నికలను బహిష్కరించడంతో టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేసుకుని గెలవడంతో ప్రజలు నివ్వెరపోయారు. మిగతా 12 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల్లో జరుగగా 7 చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement