కర్నూలు(అర్బన్): జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న మండలాలకు ఎన్నికల సామగ్రి తరలిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో ఆయా మండలాలకు గ్రామ పంచాయతీల వారీగా ముద్రించిన బ్యాలెట్ పేపర్లు, ఇతర ఎన్నికల సామగ్రిని గురువారం తరలించామన్నారు. ఈ నెల 29న రెండవ విడత ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయా మండల కేంద్రాలకు తరలించే ఏర్పాట్లను చేశామన్నారు. మండల కేంద్రాలకు చేరిన సామగ్రిని సంబంధిత అదికారులు సెగ్రిగేట్ చేసి ఆయా గ్రామ పంచాయతీలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచుతారన్నారు.


