జిల్లాలో మొదటి విడత ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌కు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎనిమది మండలాలకు ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు ఇతర ఎన్నికల సామగ్రిని పంపించాం. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాం. మండల స్థాయిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని ఆయా గ్రామ పంచాయతీలకు తరలించాం.
– జి.భాస్కర్, జిల్లా పంచాయతీ అధికారి


