పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయాలి | - | Sakshi
Sakshi News home page

పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయాలి

Nov 26 2026 1:17 AM | Updated on Nov 26 2026 1:17 AM

● డిసెంబర్‌ 9, 10 తేదీల్లో

కర్నూలు బాలోత్సవం

కర్నూలు సిటీ: పిల్లలను కేవలం చదువుకే పరిమితం చేయకుండా ఆటలు, సాంస్కృతిక అంశాలపైనా మక్కువ పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్‌.సుధాకర్‌ తల్లిదండ్రులను కోరారు. బాలోత్సవంలో భాగంగా నిర్వహించే పోటీలతో పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయవచ్చన్నారు. బుధవారం కర్నూల్‌ నగరంలోని ఏ క్యాంపు మాంటిస్సోరి స్కూల్‌లో 6వ కర్నూలు బాలోత్సవం పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు బాలోత్సవ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు జంధ్యాల రఘుబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈఓతో పాటు ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు జి.పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి డి.ధనుంజయ, ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ డాక్టర్‌ బి.శంకర్‌ శర్మ, మాంటిస్సోరి విద్యాసంస్థల డైరెక్టర్‌ డాక్టర్‌ కృష్ణ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలోత్సవ వేడుకల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను కూడా భాగస్వాములను చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement