కర్నూలు(అగ్రికల్చర్): అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ నెల 14న యథావిధిగా పని చేయనున్నాయి. మామూలుగా అయితే రెండవ శనివారం సెలవు దినం. అక్టోబర్ 19 (సోమవారం) వర్కింగ్ డే ఉండగా ప్రభుత్వం దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని సెలవుదినంగా.. నవంబర్ 14వ తేదీ రెండవ శనివారాన్ని వర్కింగ్ డేగా ప్రకటించింది. ఇందులో భాగంగా శనివారం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థలు పనిచేస్తాయి. బ్యాంకులకు మాత్రం సెలవు ఉంటుంది.
కాటన్ మిషన్ అమలుపై నివేదిక ఇవ్వండి
కర్నూలు(అగ్రికల్చర్): కాటన్ మిషన్ అమలుపై నివేదిక ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి ఏడీఏలను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సాక్షి’లో ఈనెల 12న ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. అక్రమాలకు తావులేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.
సహకార ఎన్నికలకు
559 పోలింగ్ కేంద్రాలు
● జిల్లా సహకార అధికారి శిరీష
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 43 పీఏసీఎస్‌లు ఉన్నాయని, ఒక్కో సంఘం పరిధిలో 13 ప్రకారం 559 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని జిల్లా సహకార అధికారి(డీసీవో) శిరీష తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతోమాట్లాడుతూ.. సహకార ఎన్నికలకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఇందుకు అనుగుణంగా సహకార సంఘాల్లోని సభ్యుల ఈ–కేవైసీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు తదితర కార్యాక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ నాటికి ఈ–కేవైసీ పూర్తి చేయడం, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లోకి కొత్త సభ్యులను చేర్చుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. 16వ తేదీ సాయంత్రానికి సభ్యుల లిస్ట్ ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని సంఘాల్లో 76,066 మంది సభ్యులు ఉన్నారని, ప్రస్తుతం ఈ–కేవైసీ జరుగుతుందని తెలిపారు. కొత్త సభ్యులకు అవకాశం ఇవ్వడంతో సభ్యుల సంఖ్య 1.30 లక్షలకు చేరే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 250 నుంచి 300 మందికి ఓటర్లు ఉంటారని పేర్కొన్నారు.
యువత సరికొత్త
ఆవిష్కరణలు చేయాలి
కర్నూలు సిటీ: నూతన టెక్నాలజీకి అనుగుణంగా యువత సరికొత్త ఆవిష్కరణలు చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ లో భాగంగా శుక్రవారం జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా చాంపియన్‌షిప్ పీపీటీ రౌండ్ పోటీలు నిర్వహించారు. విజేతల ఎంపిక కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన జేసీ మాట్లాడారు. ఇంటర్నెట్, మొబైల్‌ను కాలక్షేపం కోసం కాకుండా విజ్ఞానం పెంచుకొనే విధంగా ఉపయోగించాలన్నారు. సెట్కూరు సీఈఓ వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో విజేతలను రాష్ట్రస్థాయి పంపిస్తామని, అక్కడ విజేతలైన వారు న్యూఢిల్లీలో జనవరి 12న నిర్వహించే జాతీయ యువజన ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా టూరిజమ్ అధికారి తిరుమల నాయుడు, మై భారత్ జిల్లా యువజన అధికారి ఐజయ్య, పుల్లా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు డా.దేవకీ, శ్రీ మురళీ కృష్ణ, కురిడి సురేష్, ఆర్.జి.యం ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు డా.సోఫియా ప్రియదర్శిని పాల్గొన్నారు.
మద్యం అక్రమ రవాణాను అరికట్టాలి
● ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డీసీ శ్రీదేవి
డోన్ టౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని కర్నూలు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం డోన్ ఎకై ్సజ్ స్టేషన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి అధికారులతో సమావేశమయ్యారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసులు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సారా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. అవసరమైతే బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో నంద్యాల స్క్వాడ్ సీఐ లక్ష్మణ్‌దాసు, డోన్ ఎకై ్సజ్ సీఐ జప్రూల్లా, ఎస్‌ఐలు సోమశేఖర్‌రావు, దౌలత్‌ఖాన్, ట్రైనీ ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, అన్వేష్ సిబ్బంది ఉన్నారు.


