పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి

Nov 14 2026 12:59 AM | Updated on Nov 14 2026 12:59 AM

● పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి

● డీఐజీని కలసి వినతిపత్రం

సమర్పించిన వైఎస్సార్‌సీపీ నేతలు

కర్నూలు: గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయి పారదర్శకతతో నిష్పక్షపాతంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పోలీసు యంత్రాంగాన్ని కోరారు. శుక్రవారం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డితో కలసి కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడారు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ అరెస్టులు చోటు చేసుకున్నాయన్నారు. అధికార బలంతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంటే ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థిని స్వేచ్ఛగా ఎన్నుకునే హక్కు అని, ఆ హక్కులకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదని స్పష్టం చేశారు. ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. అధికార పార్టీకి ఒక విధంగా, ప్రతిపక్ష పార్టీలకు మరో విధంగా వ్యవహరించకుండా చట్టం ముందు అందరూ సమానమే అన్న స్ఫూర్తితో పోలీసులు విధులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో ఎదురైన పరిస్థితులు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని, ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఐజీని కోరామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడి హక్కు.. ఆ హక్కును కాపాడటం పోలీసుల బాధ్యత అని కాటసాని రామభూపాల్‌ రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement