పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా? | - | Sakshi
Sakshi News home page

పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా?

Nov 14 2026 12:59 AM | Updated on Nov 14 2026 12:59 AM

● గత ప్రభుత్వంలో నష్టం జరిగిన ఏడాదిలోనే పరిహారం ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

● గత ప్రభుత్వంలో నష్టం జరిగిన ఏడాదిలోనే పరిహారం ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

గడివేముల: పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నా పాలకులు పట్టించుకోరా... అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం మండల పరిధిలోని కేసీ ఆయకట్టు కింద ఉన్న పెసరవాయి, కరిమద్దెల గ్రామాల్లో ఎండిపోతున్న పంటలను పరిశీలించారు. అనంతరం పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న, సోయా చిక్కుడు పంటలు ఎండిపోయి నష్టపోతున్నామని రైతులు కేసీ కెనాల్‌, రెవెన్యూ అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. కరిమద్దెల, పెసరవాయి, గడిగరేవుల, బూజనూరు, చిందుకూరు, తిరుపాడు, గ్రంథివేముల, కొరటమద్ది తదితర గ్రామాల్లో కేసీ ఆయకట్టు కింద ఐదు వేల ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న సాగు కంకి దశకు చేరుకుంటున్న సమయంలో సాగునీరు అందక ఎండిపోతున్నాయన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2019 ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఉచిత వంటల బీమా పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడి్‌డ్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ–క్రాప్‌ నమోదు ప్రామాణికంగా ఉచిత పంటల బీమాను అమలు చేశారన్నారు. ఏ సీజన్‌లో నష్టపోతే ఆ సీజన్‌లోనే నష్టపరిహారం అందించేవారని, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాకే జమ చేసేవారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వర్షాలు సకాలంలో కురవకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడటంతో అప్పులపాలయ్యారన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో నష్టపోయిన రైతులకు ఇంత వరకు పరిహారం అందించ లేదన్నారు. రెండు సీజన్లలో నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. కాటసాని వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు ఎల్లారెడ్డి, కృష్ణారెడ్డి, పుల్లయ్య, డాలుస్వామి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement