● 50 మంది విద్యార్థులు సురక్షితం
గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్లలో శుక్రవారం స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పింది. బస్సులోని 50 మంది విద్యార్థులు సురక్షితంగా ఉన్నారు. ఉదయం రాళ్లదొడ్డి గ్రామం నుంచి విద్యార్థులతో బస్సు జోనియస్ గ్లోబల్ స్కూల్కు వస్తోంది. సైడ్ ఇండికేటర్లు వేయకపోవడంతో గోనెగండ్ల వద్ద వెనుక వస్తున్న లారీ బస్సును స్పల్పంగా ఢీకొంది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడ ఉన్న జనం గూమికూడారు. ప్రమాదం పెద్దగా జరిగి ఉంటే బస్సులో ఉన్న 50 మంది విద్యార్థులకు పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి కండిషన్లో ఉన్న ప్రైవేట్ స్కూల్ బస్సులను నడిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


