పూర్వం కొన్నేళ్ల క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయించాడు. మాఘ మాసంలో షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని బ్రాహ్మణుడు సూచించాడు. దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నుతండగా నాగలికి ఉన్నట్లుండి భూమిలో ఏదో అడ్డుతగులుతుంది. ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమౌతుంది. ఆ తేజస్సుకు రైతు కంటిచూపు కోల్పోతాడు. కాసేపటి చుట్టు పక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కులాగి చూస్తారు. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయట పడుతుంది. గుడి నిర్మాణం ముందు గ్రామస్తులు బాలుని రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుని వేడుకుంటారు. రాత్రి వేళ గుడి నిర్మాణం చేపట్టి కోడి కూతకు ముందే పూర్తి చేయాలని, లేదంటే ఏడుగురు బలి అవుతారని హెచ్చరిస్తాడు. స్వామివారి స్వయంభు విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు. కోడి కూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. పైకప్పులేని ఆలయం సిద్ధమవుతుంది. ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. మొదట ఈ గ్రామం పేరు కొత్తూరు కాగా స్వామి వెలసిన తరువాత సుబ్బరాయుడు కొత్తూరుగా మారింది.
శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరుడి
మూలవిరాట్


