విద్యుత్‌ బస్సులు ఆర్టీసీనే నడపాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ బస్సులు ఆర్టీసీనే నడపాలి

Nov 12 2026 1:19 AM | Updated on Nov 12 2026 1:19 AM

నంద్యాల(వ్యవసాయం): ఆర్టీసీలో ప్రైవేటు వ్యక్తులతో విద్యుత్‌ బస్సులను నడపాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, ఆర్టీసీ డ్రైవర్లతోనే బస్సులను నడపాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్టమెంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్‌రావు డిమాండ్‌ చేశారు. బుధవారం ఏపీపీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఆర్‌ఎస్‌రావు ఆధ్వర్యంలో స్థానిక ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా స్థాయి కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంస్థ అభివృద్ధి లక్ష్యంగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. డిసెంబర్‌లో జరిగే ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగుల క్రెడిట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ ఎన్నికల్లో ఈయూ శ్రేణులంతా ఐక్యంగా పని చేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీలో విద్యుత్‌ బస్సులు ప్రవేశపెట్టడాన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ వ్యతిరేకం కాదని, అవసరమైతే బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి సొంత సిబ్బందితో నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement