అధ్యాపకుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

అధ్యాపకుల పాత్ర కీలకం

Nov 12 2026 1:19 AM | Updated on Nov 12 2026 1:19 AM

● జేఎన్‌టీయూ అనంతపురం వీసీ ప్రొఫెసర్‌ హెచ్‌. సుదర్శనరావు

అనంతపురం: ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అధ్యాపకుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదని జేఎన్‌టీయూ అనంతపురం వీసీ హెచ్‌. సుదర్శనరావు అన్నారు. జేఎన్‌టీయూ అనంతపురం పాలక భవనంలోని ఆర్యభట్ట ఆడిటోరియంలో బుధవారం ‘యూనివర్సిటీ లెవెల్‌ అవార్డ్స్‌–2026’ ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వీసీ ముఖ్య అతిథిగా హాజరై.. అవార్డు గ్రహీతలను ఘనంగా సత్కరించారు. వీసీ మాట్లాడుతూ విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో అధ్యాపకులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

జిల్లాకు సంబంధించి అవార్డులు ఇలా..

యూనివర్సిటీ బెస్ట్‌ టీచర్స్‌ అవార్డు

(అటానమస్‌ కళాశాలలు):

ఎస్‌.జహుర్‌ ఉయి హుక్‌

(పుల్లారెడ్డి కాలేజ్‌, కర్నూలు).

ఉత్తమ ఫార్మాస్యూటికల్‌ సైన్స్‌ అవార్డు:

ఎన్‌.ఎం.వాగేష్‌ (సెయింట్‌ జోన్స్‌ ఫార్మసీ కాలేజ్‌, కర్నూలు).

బెస్ట్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ అవార్డు: జి.చంద్రారెడ్డి

(శాంతిరామ్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌, నంద్యాల).

బెస్ట్‌ ఉమెన్‌ కో–ఆర్డినేటర్స్‌ అవార్డు:

డాక్టర్‌ కె.దేవికాదేవి (పుల్లారెడ్డి కాలేజ్‌, కర్నూలు).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement