● ఉమ్మడి జిల్లాలో రూ.7,951
హెక్టార్లలో సాగు లెక్కలు
● కర్నూలు జిల్లాకు 11.25 కోట్లు,
నంద్యాల జిల్లాకు
రూ.1.84 కోట్లు విడుదల
● పత్తి సాగులో అధునాతన పద్ధతులు
పాటించాలనేది ప్రదాన ఉద్దేశం
● పేపర్లపై తప్పితే
ఎక్కడా కనిపించని అమలు
● ఇప్పటికే కర్నూలు జిల్లాలో
రూ.6.75 కోట్లు, నంద్యాల జిల్లాలో
రూ.75.45 లక్షల వినియోగం
● క్షేత్రస్థాయిలో ఈ పథకం ఉందనే
విషయమే తెలియని రైతులు
● కంపెనీలతో కుమ్మకై ్క ఇన్‌పుట్స్‌ను
నగదుగా మార్చుకుంటున్న వైనం
క్రిష్ణగిరి మండలంలో
పత్తి పంటను దున్నేస్తున్న వైనం
కర్నూలు(అగ్రికల్చర్): వర్షాభావం పత్తి రైతులకు కన్నీళ్లు మిగిలిస్తే.. వ్యవసాయ శాఖలోని కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వ్యవసాయ శాఖ అక్రమాలు, అవినీతికి కేరాఫ్‌గా మారింది. తాజాగా వ్యవసాయ శాఖలో మరో కుంభకోణం సంచలనం రేపుతోంది. కాటన్ మిషన్ నిధులను కొల్లగొడుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. రైతులకు ఎలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించకపోయినా దొంగ బిల్లులతో నిధులు కొల్లగొట్టినట్లు స్పష్టమవుతోంది. పత్తిలో అధునాతన పద్ధతులను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రత్యేకంగా కాటన్ మిషన్ పథకాన్ని 2026–27 నుంచి అమలు చేస్తోంది. కర్నూలు జిల్లాలో రాష్ట్రంలోనే పత్తి సాగు ఎక్కువగా ఉండటంతో ఈ పథకం కింద అత్యధిక బడ్జెట్‌ను ఈ జిల్లాకే కేటాయించారు. కాటన్ మిషన్‌లో మూడు అనుబంధ పథకాలు(హెచ్‌డీపీఎస్, క్లోజర్ ప్లేసింగ్, ఐసీఎం) ఉండగా.. వీటి కింద 7,951 హెక్టార్లలో పత్తి సాగు చేసినట్లు కాగితాలపై కనిపిస్తోంది. హెచ్‌డీపీస్ కింద హెక్టారుకు రూ.18,500, క్లోజర్ ప్లేసింగ్‌లో హెక్టారుకు రూ.15వేలు, ఐసీఎంలో హెక్టారుకు రూ.10 వేలు ఖర్చు చేస్తున్నారు. రసాయన ఎరువులు మినహా విత్తనంతో పాటు పురుగు మందులు, సూక్ష్మపోషకాలు, విత్తన శుద్ధి మందులు, గులాబిరంగు పురుగుల నివారణ మందులు ఉచితంగా ఇస్తారు. పత్తి విత్తనాలకు సంబంధించి వాటి ఽవిలువను విధిగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. లేదా వ్యవసాయ శాఖనే విత్తనాలు కొని పంపిణీ చేయాలి. అయితే కర్నూలు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పత్తి విత్తన కంపెనీలకు విత్తనం విలువను జమ చేయించినట్లు తెలుస్తోంది. కంపెనీల నుంచి ఈ సొమ్మును వెనక్కి తీసుకునేందుకు ఈ విధంగా చేసినట్లు చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో 39 మండలాల్లో కాటన్ మిషన్ అమలవుతున్నా.. 96 శాతం మండలాల్లో ఒక్క రైతుకూ విత్తనం కానీ, విత్తనం విలువకు సంబందించిన నగదు కానీ అందకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జిల్లాలో కాటన్ మిషన్ కింద కర్నూలు జిల్లాలో 6,800 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 1,151 హెక్టార్లలో పత్తి సాగు చేసినట్లు లెక్కలు ఉన్నా.. రైతులకు పురుగు మందులు, సూక్ష్మపోషకాలు, విత్తనశుద్ధి మందులు అందించిన దాఖలాలు లేవు.
కాటన్ మిషన్ పథకం కర్నూలు జిల్లాలోని అన్ని మండలాలు, నంద్యాల జిల్లాలోని 12 మండలాల్లో అమలవుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తి సాగుకు పెట్టింది పేరు. అయితే వర్షాభావం వల్ల పత్తి పంట లేకుండా పోయింది. ఈ ఏడాది ఈ స్కీమ్ వద్దంటూ రాసిచ్చారు. కానీ ఇక్కడ మాత్రం కాటన్ మిషన్ అద్భుతంగా పనిచేస్తోంది. ఈ పథకం కింద ఇన్‌పుట్స్ మార్క్‌ఫెడ్ సరఫరా చేస్తోంది. రెండు నెలలుగా ఏవోలు ఇన్‌పుట్స్ కోసం మార్క్‌ఫెడ్‌కు ఇండెంటు పెట్టారు. మార్క్‌ఫెడ్ అన్ని మండలాలకు సరఫరా చేసింది. కానీ రైతులకు ఇన్‌పుట్స్ పంపిణీ చేసిన దాఖలాలు లేవు. ఏవోలు మార్క్‌ఫెడ్ నుంచి వచ్చిన ఇన్‌పుట్స్, పురుగు మందులను ఆయా కంపెనీలకు అప్పగించి నగదుగా మార్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్నింటిని డీలర్లకు అప్పగించి సొమ్ము చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది.
కరువు కాలంలోనూ అధికారులకు సిరులు
కాటన్ మిషన్ కింద కర్నూలు జిల్లాకు
రూ.6.75 కోట్లు, నంద్యాల జిల్లాకు
రూ.75.45 లక్షలు విడుదలయ్యాయి.
కాటన్ మిషన్ రైతులకు ఉద్దేశించినదే
అయినా లబ్ధిపొందిన రైతులు
లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఉమ్మడి జిల్లాలో ఒక ఏడీ కాటన్ మిషన్
గురించి రైతులకు చెప్పడానికి ప్రయత్నిస్తే
ఏవోలు అడ్డుకున్నట్లు సమాచారం.
ఆదాయంలో 35–40 శాతం వాటా
ఇవ్వాల్సిందేనని ఏఓ, ఏడీఏలు
డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు
వ్యక్తమవుతున్నారు.
కాటన్ మిషన్ బడ్జెట్ ఏడీఏల ఖాతాలకే
విడుదలవుతుండటంతో తాము డిమాండ్
చేసిన స్థాయిలో కమీషన్ ఇస్తేనే
సహకరిస్తామనని ఏవోలకు
తేల్చి చెబుతున్నట్లు తెలుస్తోంది.
వర్షాభావం వల్ల పత్తి పంటే లేనప్పుడు
స్కీమ్ అమలు ఎలా సాధ్యమనే ప్రశ్న
ఎక్కడా ఉత్పన్నం కాకపోవడం గమనార్హం.
స్కీమ్‌ను పక్కాగా అమలు చేస్తున్నామం టూ ఏవోలు బిల్లులు, ఇండెంట్లు
పెడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.


